బాబుకు తలనొప్పి: రాజధాని ప్రాంతానికి పవన్ కళ్యాణ్, ఏం చెప్తారు?

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాలలో ఆదివారం పర్యటించనున్నారు. ఆయన షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరారు.

హైదరాబాదు నుంచి విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని ఉండవల్లికి నేటి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు.

Pawan Kalyan

అక్కడి నుంచి పెనుమాక వెళ్తారు. అక్కడి ప్రభుత్వం కళాశాలలో రైతులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు ఐదు గ్రామాల ప్రజలు తరలి రానున్నారు.

ఉండవల్లిలో రైతుల నిరసన దీక్షను సందర్శించనున్నారు. వారితో మాట్లాడుతారు. అనంతరం పంటపొలాలను పరిశీలిస్తారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు తదితర గ్రామాలను పవన్ సందర్శిస్తారు. బేతపాలెంలోను సందర్శించే అవకాశముంది. కాగా, పవన్ కళ్యాణ్ ఏం చెప్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+