వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాదయాత్రనా, వాహనంలోనా?: జగన్‌కు కౌంటర్‌గా.. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దూకుతున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారయింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan's AP And Telangana Tour Will Starts On Novermber 1st Week | Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దూకుతున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారయింది.

దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?

నవంబర్ మొదటి వారం నుంచి ఆయన తెలుగు రాష్ట్రాలలో పర్యటించాలని భావిస్తున్నారు. అయితే పాదయాత్ర చేయాలా లేక వాహనంలో పర్యటించాలా అనే విషయమై స్పష్టత రాలేదు.

 పార్టీ నిర్మాణంపై కీలక నిర్ణయాలు!

పార్టీ నిర్మాణంపై కీలక నిర్ణయాలు!

ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. సంబంధిత కార్యక్రమాలు ముగిసిన వెంటనే యాత్ర ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ఈ లోగా పార్టీ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని సమాచారం.

 ముగిసిన శిబిరాలు

ముగిసిన శిబిరాలు

ఇప్పటికే జన సైనికుల ఎంపిక శిబిరాలు ముగిశాయి. ఆదివారంతో ఇవి ముగిశాయి. ఐదు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వక్తలు, విశ్లేషకులు, కంటెంట్ రచయితల ఎంపిక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత అనంతపురంలో నిర్వహించారు. శని, ఆదివారాల్లో విజయవాడలో నిర్వహించిన శిబిరంతో ముగిసింది.

 వారు కూడా వచ్చారు

వారు కూడా వచ్చారు

రెండు రాష్ట్రాల్లో ఈ ఎంపికలకు ఆన్‌లైన్‌లో జిల్లాల వారీగా 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 65 శాతం మంది శిబిరాలకు హాజరయ్యారు. ఇందులో ఎక్కువమంది యువత, మహిళలు ఉన్నారు. ఇంజినీరింగ్‌, వైద్య విద్య అభ్యసించినవారు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, విశ్రాంత ఉద్యోగులు కూడా పార్టీ తరఫున పని చేసేందుకు వచ్చారు.

 అందులో నుంచి 5 వేల మంది

అందులో నుంచి 5 వేల మంది

విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో ఐటీ నిపుణులూ పాల్గొన్నారు. వీరిలో సుమారు ఐదు వేల మందిని జన సైనికులుగా ఎంపిక చేసుకొనే యోచనలో పార్టీ ఉంది. మిగిలినవారి సేవలను కూడా ఉపయోగించుకోనున్నారు. శిబిరాలకు హాజరైన వారందరితో జిల్లాల వారీగా పవన్ కళ్యాణ్‌ సమావేశం కానున్నారు.

 చురుగ్గా ఉన్న వారిని ఇలా

చురుగ్గా ఉన్న వారిని ఇలా

జన సైనికులుగా ఎంపికైన వారికి స్వల్పకాలిక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతం, లక్ష్యం, ప్రజలతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో వీళ్లు పార్టీ ప్రతినిధులుగా పాల్గొంటారు. వీరిలో చురుగ్గా ఉన్నవారిని రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు, టీవీ చర్చలకు, వివిధ వేదికలపై విశ్లేషణలకు వినియోగించుకుంటారు.

 జగన్ పాదయాత్ర.. పవన్ కళ్యాణ్ టూర్

జగన్ పాదయాత్ర.. పవన్ కళ్యాణ్ టూర్

కాగా, ఇదిలా ఉండగా వైసిపి అధినేత వైయస్ జగన్ అక్టోబర్ మొదటి వారంలో పాదయాత్ర చేయనున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ యాత్ర ఉంటుందని వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ యాత్రకు పవన్ కళ్యాణ్ టూర్ కౌంటరా?

జగన్ యాత్రకు పవన్ కళ్యాణ్ టూర్ కౌంటరా?

నాడు జగన్ యాత్ర చేస్తానని ప్రకటించిన అనంతరం పవన్ పర్యటన గురించి వార్తలు వచ్చాయి. జగన్‌కు కౌంటర్‌గా చంద్రబాబు తెరపైకి తెచ్చారనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు జగన్ పాదయాత్ర అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందని ఖరారయ్యాక.. పవన్ టూర్ కూడా అప్పుడే ప్రారంభమవుతుందని అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్‌కు కౌంటర్‌గానే పవన్ పర్యటన కనిపిస్తోందని అంటున్నారు.

English summary
Jana Sena chief and Power Star Pawan Kalyan's tour will starts in Andhra Pradesh and Telangana on Novermber 1st week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X