వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిహారం ఇవ్వకుండా అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తాం సీఎం సాబ్‌ .. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పవన్ కళ్యాణ్ అల్టిమేటం

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నివర్ తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు 35 వేల రూపాయల పరిహారం ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు . కృష్ణాజిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా గుడివాడ , మచిలీపట్నం లలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రైతులకు నష్టపరిహారం చెల్లించని జగన్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఆయనకు పేకాట క్లబ్బులపైనే శ్రద్ధ ... మంత్రి కొడాలి నానీపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలుఆయనకు పేకాట క్లబ్బులపైనే శ్రద్ధ ... మంత్రి కొడాలి నానీపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే అసెంబ్లీ అడ్డుకుంటాం

రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే అసెంబ్లీ అడ్డుకుంటాం

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ జనసేన అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భూమి హక్కులు లేక కౌలు రైతులు నష్టపోతున్నారని, కౌలు రైతులు ఇబ్బందులు పడుతుంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే రైతులకు పరిహారం చెల్లించవచ్చు

ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే రైతులకు పరిహారం చెల్లించవచ్చు

సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే రైతులకు నష్టపరిహారం చెల్లించవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మీరు సై అంటే మేము సై అంటాం అంటూ సవాల్ విసిరారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వైజాగ్లో పెట్టుకుంటారా? అమరావతిలో పెట్టుకుంటారా? లేదా పులివెందులలో పెట్టుకుంటారో తేల్చుకోవాలని అసెంబ్లీ సమావేశాలు ఎక్కడున్నా సరే, అక్కడికి వస్తామని, సమావేశాలను అడ్డుకుని తీరుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

జగన్ కు ఏ వ్యాపారాలు లేవా ? కేవలం రాజకీయాలే చేస్తున్నారా

జగన్ కు ఏ వ్యాపారాలు లేవా ? కేవలం రాజకీయాలే చేస్తున్నారా

రైతులకు న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తుందని, అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినా సరే అడ్డుకుని తీరుతామని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతల పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్ మాట్లాడితే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నాం అంటున్నారని, జగన్ కు ఏ వ్యాపారాలు లేవా ? కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారా ? అంటూ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా , ఒక ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీని చూసి భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

అయ్యా , బాబు అంటే వినేలా లేరు .. రైతుల పరిహారం ఇవ్వకుంటే ముట్టడి అల్టిమేటం

అయ్యా , బాబు అంటే వినేలా లేరు .. రైతుల పరిహారం ఇవ్వకుంటే ముట్టడి అల్టిమేటం

సీఎం సాబ్ కు చెప్తున్నాం.. రైతుల నష్టపరిహారం ఇవ్వాలని .. అసెంబ్లీ సమావేశాల లోపు రైతులకు 35 వేల రూపాయలు విడుదల చేయకపోతే అసెంబ్లీ ముట్టడికి అందరూ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అయ్యా, బాబు, సీఎం గారు అంటే మీరు పట్టించుకోవడం లేదు. రైతుల గోడు వినిపించుకోవడం లేదు. 15 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా మీలో చలనం లేదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు . రైతులకు అండగా పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఉంది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తక్షణం రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు .

English summary
Pawan Kalyan commented that if the farmers are not compensated, we will see how the assembly will function. Stating that Janasena is the only party that wants the welfare of the farmers, Pawan Kalyan called on all to come together for the siege of the assembly if Rs 35,000 is not released to the farmers within the coming assembly sessions. The ultimatum was given to CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X