పవన్ కళ్యాణ్ సీరియస్!: తదుపరి ప్రశ్నించేది జగన్‌నేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన నిన్నటి వరకు నటుడు శివాజీ, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వరుసగా స్పందిస్తున్నారు. ఇటీవలి వరకు ప్రత్యేక హోదా కోసం శివాజీ పలు విధాల్లో తన నిరసనను తెలియజేశారు. ఆయన నిరసనలకు మంచి స్పందన లభించింది.
ఆయన గతంలోనే భారతీయ జనతా పార్టీలో చేరారు. అయినప్పటికీ, ప్రత్యేక హోదా కోసం బిజెపి సహా అన్ని పార్టీల పైన విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుతానని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
పది రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతున్నారు. వేదిక ఏదయినప్పటికీ పవన్ కళ్యాణ్ హోదా పైన పదేపదే ప్రశ్నిస్తుండటం గమనార్హం. తొలుత తెలుగుదేశం పార్టీ నేతలను ఆయన నిలదీశారు. వారి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కేశినేని నాని, సుజనా చౌదరిలు ప్రతిస్పందించడంతో అది పదునెక్కింది. ఓ సమయంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారిపోతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత చంద్రబాబు సూచనతో టిడిపి నేతలు మౌనం వహించారు.
ఇప్పుడు, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చిన పార్టీ ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. లలిత్ మోడీ పైన ఉన్న ప్రేమ 5 కోట్ల ఆంధ్రుల పైన లేదా అని నిలదీశారు. దీనిపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా స్పందించినప్పటికీ... హోదా పైన పవన్ ట్వీట్లు ఏపీ నేతల్లో కదలిక తెస్తున్నాయంటున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో... రానున్న పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి మరింత ఘాటుగా మాట్లాడవచ్చునని భావిస్తున్నారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీకి లోకసభలో ఎంపీలు లేకపోయినప్పటికీ... అధినేత్రి సోనియా గాంధీకి దీనిపై ప్రత్యేకంగా విన్నవించే అవకాశాలున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటి వరకు పవన్ స్పందించకపోయినప్పటికీ.. తర్వాత టార్గెట్ వైసీపీయే కావొచ్చునని అంటున్నారు.
ఇటీవలి కాలంలో పవన్... ట్విట్టర్ ద్వారా లేదా నేరుగా విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యల పైన టిఆర్ఎస్‌కు హితవు పలికారు. ప్రత్యేక హోదా, విభజన వివాదాల పైన ప్రధాని మోడీకి సూచనలు చేశారు.
ఇక, ప్రత్యేక హోదా పైన ఏపీ టిడిపి, కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో ఇక మిగిలింది వైసీపీయే అంటున్నారు. అయితే, ప్రశ్నిస్తారా లేదా చూడాలి! మొత్తానికి పవన్ వరుస ట్వీట్లు లేదా స్పందన చూస్తుంటే ప్రత్యేక హోదా కోసం ముందుముందు మరింత ఘాటుగా ప్రశ్నించేలా కనిపిస్తోందని అంటున్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications