పవన్ కళ్యాణ్ గొప్ప విజనరీ...ఆ ఆపరేషన్ సక్సెస్.. ఇదే నిదర్శనం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం గొప్ప విజన్ కు నిదర్శనంగా నిలిచింది. ప్రజాసమస్యల పరిష్కారానికి దృష్టి సాధించే పవన్ కళ్యాణ్, పక్కా ప్రణాళికలతో ఆ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయి .చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో రైతులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు.
ఏపీలోని జిల్లాలలో ఏనుగుల గుంపులతో రైతుల సమస్య
చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో చాలాకాలంగా ప్రజలు పరిష్కారం కాని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏనుగుల గుంపులు పంటపొలాల మీద దాడిచేసి పంటలను నాశనం చేస్తుంటే రైతులు లబోదిబోమంటున్నారు. పంటపొలాలను కాపాడుకునే ప్రయత్నంలో వెళ్లిన రైతుల ప్రాణాలు కూడా ఏనుగులు తీస్తుంటే అక్కడి ప్రజలు ఏనుగుల నుండి తమను ఎలా కాపాడుకోవాలో, తమ పంట పొలాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రపోని రాత్రులు గడిపారు.

కర్ణాటక నుండి కుంకి ఏనుగులను తెప్పించిన పవన్ కళ్యాణ్
ఇక అటువంటి అతిపెద్ద సమస్యకు పవన్ కళ్యాణ్ పరిష్కార మార్గాన్ని చూపించారు. ఏనుగుల గుంపులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగులను తీసుకురావాలని నిర్ణయించిన పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి కర్ణాటక నుంచి పలమనేరు లోని ఎలిఫెంట్ హబ్ కు వాటిని తరలించి, అక్కడ ఉన్న మావటి లతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
ఏనుగుల గుంపు పంట పొలాల మీదికి రాకుండా అడ్డుకున్న కుంకి ఏనుగులు
ఇక ఈ క్రమంలో తాజాగా టేకుమంద ప్రాంతంలో ఏనుగుల గుంపు పంట పొలాల మీదకు దాడి చేయడానికి వస్తుందని గమనించి వాటిని అడ్డుకునేందుకు కుంకీ ఏనుగులను అక్కడకు తీసుకువెళ్లారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు కుంకీ ఏనుగులు గస్తీ నిర్వహించాయి. పలమనేరు అటవీ ప్రాంతంలో 8 ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు అడ్డుకున్నాయి.
పవన్ కళ్యాణ్ సూచనలతో ఆపరేషన్
అడవి ఏనుగులు పంటపొలాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేయకుండా అడ్డుకున్నాయి. కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగులు ఏనుగుల గుంపును అడ్డగించారు. పంటపొలాల వైపు రాకుండా దారి మళ్లించాయి. అయితే ఏనుగుల గుంపులో గున్న ఏనుగు ఉండడం వల్ల దారి మళ్లించడం కాసింత కష్టమైంది. ఈ ఆపరేషన్ పై పలమనేరు డిఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సమాచారం అందించి ఆయన సూచనలమేరకు పనిచేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఏనుగుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు . దీనికోసం గ్రామాల వారీగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి హెచ్చరికలు పంపాలన్నారు. ఇక అటవీ ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా రంగంలోకి దింపిన కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం కావడంతో, పవన్ కళ్యాణ్ చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications