పవన్ కళ్యాణ్ మెజార్టీపై హైపర్ ఆది ధీమా
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకుపైగా ఓట్ల మెజారిటీ వస్తుందని జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నాగబాబు, పృథ్వీ, అంబటి రాయుడు, హైపర్ ఆది, జానీ మాస్టర్, గెటప్ శ్రీను, మొగలిరేకులు సాగర్‌ను నియమించిన విసయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది గురువారం పిఠాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు పిఠాపురంలోనే ఉంటామన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గా్ల్లో ప్రచారం చేస్తామని ఆది చెప్పారు. షూటింగ్స్ అన్నీ ముందే పూర్తి చేసుకుని వచ్చామని ఆది తెలిపారు.

పిఠాపురంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం నాగబాబు ప్రచారం చేస్తున్నారని ఆది వెల్లడించారు. నాగబాబుతో కలిసి ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. తాము ఎక్కడ ఏ ఇంటికి వెళ్లినా జనసేనకు అపూర్వ స్పందన వస్తుందని.. తాము అడగక ముందే పవన్ కళ్యాణ్‌కి ఓటేస్తామని చెబుతున్నారని తెలిపారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు లక్షకుపైగా ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పారు ఆది. జూన్ 4న ఫలితాలను అందరూ చూడబోతున్నారని ఆది స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications