పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. కాపులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే పవన్ కల్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారని తెలుస్తోంది. దాదాపు 70 వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ నియోజకవర్గమే తనకు అనువైనదిగా పవన్ భావిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విసృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని కట్టిస్తానని నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మంగళవారం పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు.

ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా మరోసారి పవన్‌ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది. పవన్‌ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ. పిఠాపురంలో పవన్‌ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. పవన్ కల్యాణ్‌పై వైసీపీ నుంచి వంగా గీత రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాత చిట్టిబాబు పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన చిట్టిబాబు చిరంజీవిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా కూటమికి ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు.చిరంజీవి ఇలా బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం వెనుక పెద్ద కారణం ఉండవచ్చని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని చిరంజీవి గ్రహించారు.ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే తనకు మరిన్ని అవార్డులు వస్తాయని భావించారేమో అందుకే కూటమికి మద్దతు తెలుపుతున్నారంటూ చిట్టిబాబు వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులలోనూ గెలవరని చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ స్థానికులు కాదు కానీ వంగా గీత అక్కడే ఉంటారు ఆమె అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకొని వారి అవసరాలను తీరుస్తారు.అందుకే అక్కడ వంగ గీతానే గెలుస్తుందని తేల్చి చెప్పారు. ఏపీలో 130 సీట్లకు పైగా వైసిపి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.చ ప్రస్తుతం చిట్టిబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications