తెలంగాణ ఫలితాలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు - సీన్ మారింది..!!
మరి కొద్ది గంటల్లో తెలంగాణ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలు వ్యక్తం చేసాయి. అధికార బీఆర్ఎస్ లెక్క మాత్రం మరోలా ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ నాయకత్వం అలర్ట్ అవుతోంది. తెలంగాణలొ ఎన్నికల ఫలితాల పైన జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యాలు చేసారు. తెలంగాణలో బీజేపీ కలిసి పవన్ పోటీ చేసారు. జనసేన సాధించే సీట్ల పైన ఆసక్తి కనిపిస్తోంది.
ఫలితాల ఉత్కంఠ : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసాయి. జనసేన 8 స్థానాల్లో తమ అభ్యర్దులను బరిలోకి దించింది. రెండు పార్టీల తరపున పవన్ ప్రచారం చేసారు. ఈ కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుందనేది చూడాల్సి ఉంది. ఇక, ఏపీలో టీడీపీతో..తెలంగాణలో బీజేపీతో పవన్ మైత్రి పైన రాజకీయంగా విమర్శలు ఉన్నాయి. ఏపీలో సమీకరణాల కోసమే తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసామని పవన్ చెబుతున్నారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలోనూ బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ విశ్వసిస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ నేతల నుంచి ఏపీలో వైఖరి ఏంటనేది స్పష్టత లేదు. ఇక, తెలంగాణ రాజకీయాలపై పవన్ స్పందించారు.

పరిస్థితి మారింది : తెలంగాణలో రెండు ఎన్నికలు గెలిచిన బీఆర్ఎస్ మూడో ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో నాలుగు జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలు జనసేనలో చేరారు. ఈ సమయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో తాను పార్టీ పెట్టానని పవన్ గుర్తు చేసారు. తాను పార్టీని నడపలేనని చాలా మంది అన్నారని వివరించారు. 2019 నుంచి ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటే .. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వాళ్లమని.. కానీ ఇతర పార్టీల నుంచి నేను నాయకులను తీసుకోలేదని తెల్చిచెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచే దళిత సంఘాలు, బీసీల నాయకులతో తిరిగానని వెల్లడించారు.

జనసేన సీట్లు గెలిచేనా : వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు.కులాలకు కేటాయించి నిధులు అ కులాలకు వెళ్లడం లేదన్నారు. అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని తెలిపారు. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని అవమానాలు కూడా పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన మాట నెలబెట్టుకోలేనేమో అని అనుక్షణం భయపడ్డానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక, తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉన్న సమయంలో పవన్ బీజేపీతో కలిసి పోటీ చేయటంతో ..ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications