27న పవన్ 'ఇజం', 6 లక్షలమంది: ఫ్యాన్స్ బైక్ ర్యాలీ!
హైదరాబాద్: ఇటీవల జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులు సోమవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీన జనసేన బహిరంగ సభ కోసం రాష్ట్రంలో పలుచోట్ల ఈ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 27న విశాఖలో పవన్ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే.
ఈ బహిరంగ సభకు సంబంధంచిన సమాచారాన్ని ఆదివారం జనసేన పార్టీ విడుదల చేసింది. యూత్ ఫర్ ది నేషన్... ఫైట్ ఫర్ ది నేషన్ అనే నినాదంతో ఈ నెల 27న విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఆ సభలో పవన్ ఇజం పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పింది.

ఈ సభకు ఆరు లక్షల మంది యువత హాజరవుతారని పేర్కొంది. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సోమవారం నుండి ద్విచక్ర వాహన ర్యాలీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పింది. జనసేన పార్టీ ఐడియాలజీతో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇజం పుస్తకం రాసిన విషయం తెలిసిందే. కాగా, విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈ నెల 27న జనసేన బహిరంగ సభ జరగనుంది.












Click it and Unblock the Notifications