పవన్ షాకింగ్ డెసిషన్: వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు..లీగల్ నోటీసులు?

Recommended Video

    YCPపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు..!! || Pawan Kalyan Taken Strong Decision On Negative Campaign

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకు వస్తానని గత ఎన్నికల్లో పోటీ చేసి ఒకే ఒక స్థానానికి పరిమితమైన జనసేన పార్టీ ఆది నుండి పార్టీ పై రకరకాల తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటోంది. ప్రజారాజ్యం పార్టీ లాగా జనసేన పార్టీ పార్టీని విలీనం చేస్తుందని కొంతకాలం, ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారని, ఇక నిన్నటి దాకా బీజేపీలో పార్టీని విలీనం చేస్తారని రకరకాల ప్రచారాలు జరిగాయి. జనసేన పార్టీకి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు పెద్ద తలనొప్పిగా మారాయి.

    వైసిపి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్న జనసేన

    అయితే ఈసారి జనసేన పై జరుగుతున్న ప్రచారంపై పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు.ఈ నేపధ్యంలోనే రీసెంట్ గా జనసేనపై వైసిపి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు జనసేన పార్టీ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. జనసేన పార్టీ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ జనసేన పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ప్రయత్నించారు అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ పై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

    2000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా చెయ్యటానికి జనసేన అభిమానుల ముసుగులో విరాళాలు అంటూ వైసీపీ సోషల్ మీడియా పోస్ట్

    ఇక వైసీపీ పోస్ట్ చేసిన విషయాన్ని చూస్తే "పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు దాదాపు 2000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు అమరావతిలో తానా వర్గం ఉన్నట్లు సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి వాటిని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు" అని వైసీపీ తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్టు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

    జనసేన పార్టీకి మొదటి నుండీ సోషల్ మీడియాలో దుష్ప్రచారమే పెద్ద మైనస్

    జనసేన పార్టీకి మొదటి నుండీ సోషల్ మీడియాలో దుష్ప్రచారమే పెద్ద మైనస్

    ఇక జనసేన పార్టీ ఉపేక్షిస్తే ఈతరహా ప్రచారం ఇలాగే కొనసాగుతుందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎండగట్టాలని జనసేన నిర్ణయం తీసుకొంది. ఈ తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడ ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాదు తప్పుడు ప్రచారం చేసిన వైఎస్ఆర్‌సీపీ పై లీగల్ నోటీసులు కూడ పంపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మొదటి నుండీ ఏదో ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అదే జనసేనకు బాగా డ్యామేజ్ చేసిందన్న భావన సైతం జనసైనికులకు ఉంది. అందుకే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+