విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలింగ్ బూత్ వద్ద పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఓవర్ యాక్షన్ ... పవన్ పై పెద్దఎత్తున ట్రోల్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Elections 2019 : పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఓవర్ యాక్షన్...!! || Oneindia Telugu

ఏపీలో ఎన్నికల పోలింగ్ చాలా హాట్ హాట్ గా సాగుతుంది. ఎన్నికల అధికారులు , పోలీసులు ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించటం ఒక చాలెంజ్ గా తీసుకున్నారు. ఈసారి ఎన్నడూ లేనంతగా ఓటరు చైతన్యం ఏపీలో కనిపిస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తెలంగాణలో నివాసం ఉంటున్న వారు సైతం ఏపీ బాట పట్టారు . ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఏపీ చేరుకున్నారు. ఇక కొన్ని జిల్లాల్లో చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక కారణాలతో ఈవీఎంలు సైతం మొరాయిస్తుంటే పోలింగ్ సిబ్బంది, ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే ఓటర్లు మాత్రం ఎండలో సైతం లైన్లో వెళ్లి ఓటేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం లైన్లో ఉన్న వాళ్ళని పక్కకు నెట్టిన సెక్యూరిటీ నిర్వాకంతో ఓటేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు .

<strong>పోలింగ్ ..ఉండవల్లిలో చంద్రబాబు , పులివెందులలో జగన్ ,విజయవాడ పటమటలో పవన్</strong>పోలింగ్ ..ఉండవల్లిలో చంద్రబాబు , పులివెందులలో జగన్ ,విజయవాడ పటమటలో పవన్

పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్లు ఏపీలోని జనసేన అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పటమటలో ఉన్న చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్ లో ఉన్న పోలింగ్ బూత్ లో పవన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఇక అదే సమయంలో ఆయనను లొపలకి పంపించటానికి ఆయనతో పాటు ఉన్న వ్యక్తిగత సిబ్బంది చాలా అమానుషంగా ప్రవర్తించారు. అందరూ లైన్లో నిలబడి ఓటు వేస్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే ఆయన ముందు లోపలి వెళ్ళేలా అక్కడ ఉన్న మహిళలను , వృద్ధులను నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టి మరీ ఆయన లోపలకు వెళ్ళటానికి మార్గం సుగమం చేశారు.

Pawan Trolled Heavily by security over action for Jumping Queue To Vote

దీంతో పవన్ కళ్యాణ్ పైన అలాగే ఆయన సెక్యూరిటీ ఓవర్ యాక్షన్ పైన సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. రాష్ట్రానికి సీఎం అభ్యర్థి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అందరూ మండుటెండలో నిల్చొని ఒతేస్తుంటే కనీసం ఒక 5 నిముషాలు కూడా ఓటు వెయ్యటానికి సహనంతో ఉండలేకపోయారు. పోలింగ్ కేంద్రంలో రూల్స్ ని అతిక్రమించి, పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లకు ఇబ్బంది కలిగించటం ఒక సీఎం అభ్యర్థిగా పవన్ చెయ్యటం హేయం అని మహిళలు పవన్ పై మండిపడుతున్నారు.

English summary
film star turned politician Pawan Kalyan, had cast his vote in Vijayawada .However, the overenthusiasm shown by the security officers and Pawan's personnel security at the polling booth is being criticised vehemently by everyone. While hundreds of voters were standing in the queue under the harsh summer heat to cast their votes, the security men began pushing them to make way for Pawan so that he could cast his vote first and leave early.Even several ladies and elders were pushed aside mercilessly by the security personnel. Soon, angry voters began lambasting Pawan for his insensitive behaviour. "How can a CM candidate disobey the rules and cause inconvenience to the public?," asked a young woman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X