జనంపై చంద్రబాబు మోపిన భారం ఎంత?

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తోన్నారు. కడపలో పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు.

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌‌ నియమితులైన తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాకు రావడం ఇదే తొలిసారి. వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు.

Peddireddy Ramachandra Reddy lashes out at YS Sharmila

పార్టీని పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేస్తోన్నామని పెద్దిరెడ్డి తెలిపారు. స‌మ‌ర్ధులైన వారికి ప‌ద‌వులను ఇస్తామ‌ని పేర్కొన్నారు. 2029లో మళ్లీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోన్నామని, తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని అన్నారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీ సూచనలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీలు వేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్‌ పాలిటిక్స్‌‌కు తెర తీసిందని ఆరోపించారు.

6,000 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని చంద్రబాబు జనంపై మోపారని పెద్దిరెడ్డి ఆరోపించారు. జగన్‌ తప్పిదాల వల్లే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయనే డైవర్షన్ పాలిటిక్స్‌ను అనుసరిస్తోన్నారంటూ మండిపడ్డారు. విజయవాడలో వరదలు సైతం జగన్ వల్లే సంభవించాయంటూ అభూత కల్పనలు సృష్టిస్తోన్నారంటూ ధ్వజమెత్తారు.

Peddireddy Ramachandra Reddy lashes out at YS Sharmila

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని, సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. జగన్- చంద్రబాబు పరిపాలనలో ఉన్న తేడాలను ఇప్పటికే ప్రజలు గమనించారని, 2029 నాటి ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెబుతారని అన్నారు.

వ్యవసాయ బీమా ప్రీమియం మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం రైతుల మీదే పెట్టిందని, వ్యవసాయం దండగ అంటూ చెప్పిన వ్యక్తి రైతులను ఏలా ఆదుకుంటాడనుకున్నారని ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల వైఖరిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను షర్మిల చదువుతున్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+