AP Pensions: ఒకటో తేదీన అందని పెన్షన్లు- మేడే ఎఫెక్ట్ తో బ్యాంకుల మూత..!
ఆంధ్రప్రదేశ్ లో పెన్షనర్లకు ఇవాళ పెన్షన్ అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ దూరం పెట్టిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి బ్యాంకుల్లో ప్రభుత్వం ఈ మొత్తాల్ని క్రెడిట్ చేస్తోంది. అలాగే బ్యాంకు ఖాతా లేని వారికి, బ్యాంకులకు వెళ్లలేని వారికి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కానీ ఇందులోనూ ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి కారణం బ్యాంకులకు ఇవాళ మేడ్ సెలవు కావడమే.
రాష్ట్రంలో ఇవాళ పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించినా.. పలు చోట్ల ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇవాళ మేడే సెలవు కావడంతో బ్యాంకులకు వెళ్లి పింఛన్ దారులు తమకు రావాల్సిన పెన్షన్ మొత్తాన్ని తీసుకునే పరిస్ధితి లేకుండా పోతోంది. వీరిలో చాలా మంది ఏటీఎం కార్డులు లేకపోవడం, ఉన్నా ఎలా తీసుకోవాలో తెలియకపోవడం వంటి కారణాలతో నేరుగా బ్యాంకులపైనే ఆధారపడుతున్నారు.

అలాగే దివ్యాంగులు, మరికొన్ని బ్యాంకులకు వెళ్లలేని వారికి ఇంటింటికీ పెన్షన్ పంపాలని భావించినా బ్యాంకులకు సెలవు కావడంతో ఆ మొత్తాలు డ్రా చేసే పరిస్ధితి లేకుండా పోయింది. దీంతో ఇవాళ అందాల్సిన పెన్షన్ వారికి అందడం లేదు. దీంతో వీరిలో కొందరు సచివాలయాల వద్దకు వెళ్తున్నారు. అక్కడ వీరికి సమాధానం చెప్పే పరిస్దితి లేదు. ఈ నేపథ్యంలో వీరంతా పెన్షన్ల కోసం రేపటి వరకూ వేచి చూడాల్సిందే. బ్యాంకులకు వెళ్లలేని వారికి ఎల్లుండి నుంచి పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేస్తామని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications