పెనుగొండ మాజీ ఎమ్మెల్యే చినబాబు కన్నుమూత...
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు (చినబాబు) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. చినబాబు మృతితో కుటుంబ సభ్యులతో పాటు, స్థానిక వైసీపీ కార్యకర్తల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుగొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా చినబాబు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన... 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలో చేరారు.

2014లో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ ఆచంట నియోజకవర్గ కన్వీనర్‌గా పనిచేశారు.చినబాబు మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజుతో పాటు పలువురు స్థానిక వైసీపీ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications