ముందు వేణుస్వామి జాతకం ఎవరికైనా చూపించండ్రా, జగన్, కేసీఆర్, ప్రజ్వల్, ఇంకా ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో ఒకటి చెప్పి క్రెడిట్ కొట్టేయాలని అనుకున్న జ్యోతిష్యుడు వేణుస్వామి లెక్కతప్పింది. తెలంగాణలో కేసీఆర్ విషయంలో, ఐపీఎల్ 2024 మ్యాచ్ లు జరిగే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో వేణుస్వామి చెప్పిన జోస్యం తారుమారు అయినా ఆయన ఏమాత్రం తగ్గలేదు. 2024లో జగన్ మరోసారి సీఎం అవుతారని, మరో 19 ఏళ్లు ఆయన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని వేణుస్వామి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మకుటం లేని మగమహారాజుగా జగన్ సత్తా చాటుకుంటారని, ఆయన జాతకం చాలా అద్బుతంగా ఉందని వేణుస్వామి పదేపదే ఇంటర్వూలలో చెప్పారు. అందరి జాతకాలు చెబుతున్న వేణుస్వామి జాతకం ఎవరికైనా చూపించండ్రా అంటూ ఇప్పుడు ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. జగన్ జాతకం ఎలా ఉన్నా ముందు మీ జాతకం మీరు చూసుకుండి సార్ అంటూ వేణుస్వామికి కౌంటర్ ఇస్తున్నారు.

గతంలో వేణుస్వామి చెప్పిన ప్రముఖుల జాతకాలు ఎలా ఉన్నా కొందరి జాతకాలు మాత్రం తల్లకిందులు అయ్యాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జాతకం అలాగే అయ్యింది. ఇప్పుడు జగన్ జాతకం కూడా వేణుస్వామి చెప్పినదానికంటే రివర్స్ అయ్యింది. కొన్ని నెలల క్రితం కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ, ఆయన భార్య భవానీ రేవణ్ణ, వీరి కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ హైదరాబాద్ వెళ్లి వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించారు.
ఆ సమయంలో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుమారుడు హెచ్ డీ రేవణ్ణ కుటుంబ సభ్యుల జాతకాలు చాలా అద్బుతంగా ఉన్నాయని, వారి కోసం ప్రత్యేక పూజలు చేశానని వేణుస్వామి చెప్పారు. హైదరాబాద్ లోని వేణుస్వామి ఇంటిలో ప్రత్యేక పూజలు చేసిన రెండు రోజుల తరువాత హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా సాధించిన విజయం చెల్లదని ఆయన మీద కర్ణాటక హైకోర్టు వేటు వేసింది. తరవాత ప్రజ్వల్ రేవణ్ణ సుప్రీం కోర్టుకు వెళ్లారు.
ఇప్పుడు అదే ప్రజ్వల్ రేవణ్ సెక్స్ స్కాండల్ కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాడు. హాసన్ లో ఎంపీగా ఓడిపోయాడు, ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్ డీ రేవణ్ణ జైలుకు వెళ్లి ఇటీవలే షరతులతో బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ సైతం తనను సిట్ అధికారులు అరెస్టు చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తమకు మంచి జరగాలని వేణుస్వామి ఇంటిలో పూజలు చేయించుకున్న ప్రజ్వల్ రేవణ్ణ ఫ్యామిలీ పరిస్థితి ఈ రోజు మీరు గమనించండి, ప్రత్యేక పూజలు చేయించుకున్న వారికి ఎంత వరకు మంచి జరిగింది అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వేణుస్వామి చెప్పిన కొందరి జాతకాలు అటూఇటూ అయిపోతున్నాయని, కావాలనే కొందరు పనిపాట లేని చిల్లరగాళ్లు సోషల్ మీడియాలో ఆయన్ను ప్రముఖ జ్యోతిష్యుడు అని కిరీటం పెడతున్నారని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. మొదట వేణుస్వామి జాతకాన్ని ఎవరికైనా చూపించండ్రా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద వేణుస్వామిని హీరో చేసిన కొందరు ఇప్పుడు సామాన్య ప్రజలకు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications