21 రోజుల్లోనే ఐటీ కంపెనీలకు స్థలంతో సహా అనుమతులు: మంత్రి లోకేష్

ఐటీ సంస్థలకు రానున్న కాలంలో కేవలం 21 రోజులలోనే కార్యాలయం స్థలంతో పాటు అన్ని అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.

అమరావతి: ఐటీ సంస్థలకు రానున్న కాలంలో కేవలం 21 రోజులలోనే కార్యాలయం స్థలంతో పాటు అన్ని అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో ఐటీ సంస్థలకు అనుతులతో పాటు కార్యాలయ స్థలం ఇవ్వాలంటే సంవత్సరం పట్టేదని, ఇప్పుడు 50 రోజుల్లోనే అన్ని అనుమతులు వస్తున్నాయన్నారు.

Permission to IT companies in within 21 days: Nara Lokesh

ఏపీలో 2019లోపు లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకు కోటి చదరపు అడుగుల కార్యాలయ స్థలం అవసరమని తెలిపారు.

విభజన తర్వాత ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆకర్షణీయ పాలసీలను తమ ప్రభుత్వం తెచ్చిందన్నారు.

ఐటీ సంస్థలకు కార్యాలయ స్థలం సమస్యను అధిగమించేందుకు సీఎం చంద్రబాబు సూచనలతో డెజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీని రూపొందించామని, ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన స్థలాన్ని రాయితో ఇస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+