పెట్రోలు లీకేజ్, బిందెలతో క్యూ కట్టిన ప్రజలు: స్పైస్ జెట్‌లో సాంకేతిక లోపం
అనంతపురం: పెట్రోల్‌ను తీసుకు వెళ్తున్న గూడ్స్ రైలు ట్యాంకర్ల నుంచి పెట్రోలు లీక్ అవుతుండటంతో ఓ రైలును అనంతపురం జిల్లా పెనుగొండ రైల్వే స్టేషన్ వద్ద నిలిపేశారు. రైలు నుంచి పెట్రోల్ లీక్ అవుతుందనే విషయం స్థానికులకు తెలిసింది.
లీక్ అవుతున్న పెట్రోలును పట్టుకునేందుకు పెనుగొండ ప్రజలు రైల్వే స్టేషన్ వద్దకు వరుస కట్టారు. క్యాన్లు, డబ్బాలు, బిందెలు తీసుకు వచ్చి పెట్రోలును తీసుకు వెళ్తున్నారు. ఈ గూడ్స్ రైలు ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం
ఉదయం ఏడు గంటలకు శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులను తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో దించేశారు.
విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలట్ సమయస్ఫూర్తితో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణీకులు క్షేమంగా ఉన్నారు. తిరుపతి ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications