వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ప్యామిలీ అరకోటి: లోకేష్, రికార్డ్: బాబు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వం విజయవంతమైనందుకు చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్‌ను అభినందించారు.

మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. చంద్రబాబు, పలువురు నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రికార్డ్ స్థాయిలో 53 లక్షల సభ్యత్వం వచ్చిందన్నారు.

సభ్యుల వివరాలు కంప్యూటరీకరించినట్లు చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసమే తాను ఆలోచిస్తానన్నారు. కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడంలో ముందుంటానని చెప్పారు. సభ్యత్వ నమోదు విజయవంతం అయినందుకు లోకేష్‌ను అభినందించారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

52 రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కలిపి 53 లక్షల క్రియాశీల సభ్యత్వం నమోదు చేసిందని, ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీగా సభ్యత్వం చేర్పించిన ఘనత టీడీపీ శ్రేణులకే దక్కుతుందని, మొత్తం దేశంలో ఇదొక రికార్డని, భారతదేశంలో ఇప్పుడు టీడీపీ ఒక ప్రబల శక్తి అని చంద్రబాబు పేర్కొన్నారు.

 టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం అరకోటి దాటిన సందర్భంగా మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్‌ భవన్‌లో అభినందన కార్యక్రమం జరిగింది.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

గతంలో సభ్యత్వ నమోదుకు పుస్తకాలు పంపితే తిరిగి వచ్చేవి కావని, సభ్యత్వ రుసుం కూడా ఎప్పటికో పార్టీ కార్యాలయానికి చేరేదని అప్పటి కష్టాలను చంద్రబాబు గుర్తు చేసుకొన్నారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

సరుకు బాగుంటే స్పందన బాగుంటుందని, తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న సానుకూలతకు సభ్యత్వ నమోదు ఒక నిదర్శనమన్నారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

53 లక్షల మంది సభ్యులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న పెద్ద బలగమని, టీడీపీ కార్యకర్తలను మనం మన కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలన్నారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం


అధికారంలో ఉన్నా లేకపోయినా వారు పార్టీ కార్యాలయానికి వస్తే భోజనం పెట్టి పంపుతున్నామని, ఇతర పార్టీల కార్యాలయాల్లో జేబుల్లో ఉన్నవి ఖాళీ చేసి పంపుతారన్నారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం


సభ్యులుగా చేరిన వారికి ప్రమాద బీమా, ప్రమాదాలకు గురైతే ఆస్పత్రి ఖర్చులు పొందే సదుపాయం కల్పించడం శుభ పరిణామమని, ఇది మాత్రం చాలదని, ఇంకా చేయాలన్నారు. మన కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలన్నారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

ఆ కార్యక్రమాన్ని ఇటీవలే చేపట్టి కొద్ది కాలంలోనే వందల మందికి ఉద్యోగాలు ఇప్పించాలన్నారు. మన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆర్ధికంగా వారి కాళ్ళపై వారు నిలబడేలా తయారు చేయాలన్నారు. దోపిడీకి వేరే పార్టీలకు పేటెంట్‌ రైట్లు ఉన్నాయన్నారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం


మనం నీతి నిజాయితీగానే పది రూపాయలు సంపాదించుకుందామని, అందుకోసం ఏం చేయాలి...మీకు ఎలాంటి శిక్షణ ఇప్పించి నిలబెట్టాలన్నది తావు ఆలోచిస్తున్నానని చెప్పారు.

 టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

త్వరలో దీనికి ఒక రూపం ఇస్తామన్నారు. ఈ అధికారం కార్యకర్తల బిక్ష అని, వారి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు చెప్పారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

సభ్యత్వ నమోదు ద్వారా ఈసారి రూ.ఏభై కోట్లు వసూలయ్యాయని చెప్పారు. దీని తర్వాత జరిగే సంస్ధాగత ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సరైన పద్దతిలో ప్రజల్లోకి వెళ్ళడానికి పార్టీ యంత్రాంగం చొరవ చూపాలని చంద్రబాబు కోరారు. తెలంగాణ నేతలు హుషారుగా పనిచేస్తున్నారని, అయినా ఇంకా వేగం పెంచి నిత్యం ప్రజల్లో ఉండి పని చేయాలన్నారు.

 టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

సభ్యత్వ నమోదులో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ఐదో స్ధానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పాలకొల్లు, బాపట్ల, వినుకొండ, చంద్రగిరి, కుప్పం మొదటి ఐదు స్ధానాల్లో నిలిచాయి. జిల్లాల్లో మొదటి స్ధానంలో గుంటూరు, ఆ తర్వాత వరుసగా పశ్చిమ గోదావరి, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం ఉన్నాయి. తెలంగాణలో ఏడు లక్షల సభ్యత్వ నమోదు జరిగింది. ఖమ్మం జిల్లా మొదటి స్ధానంలో నిలిచింది.

టీడీపీ సభ్యత్వం

టీడీపీ సభ్యత్వం

టీడీపీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరిన అరకోటి మంది ఇప్పుడు తమ కుటుంబ సభ్యులని, వారి బాధ్యత తమదని నారా లోకేష్ అన్నారు. కార్యకర్తల కోసం హెల్ప్ డెస్క్ ఉంటుందన్నారు.

English summary
Photos: 50Lakhs+ Successfull TDP Membership Enrollment Programme today at NTR Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X