అందరిదని కోదండ: పిఎస్‌లో ఎమ్మెల్యే స్లోగన్(పిక్చర్స్)
హైదరాబాద్: విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసనలు తెలుపుతున్నారు. భీమా భవన్, దేవాదాయ శాఖ తదితర కార్యాలయాల్లో ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.
తెలంగాణ ఉద్యోగులు సైతం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మాట్లాడుతూ... హైదరాబాద్ ఏ ఒక్కరిది కాదని, ఇక్కడ నివసించే వారందరిదన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులను సమైక్యవాదులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి శత్రుచర్ల విజయ రామరాజును సమైక్యవాదులు అడ్డుకున్నారు. కాగా, సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్న టిడిపి నేత పయ్యావుల కేశవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. పయ్యావుల ఇతర ఉద్యోగులతో కలిసి నాంపల్లి పిఎస్‌లో సమైక్య నినాదాలు చేశారు.

తెలంగాణ బిల్లు
పార్లమెంటులో త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బీమా భవన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు.

దేవాదాయ శాఖ
కలిసి ఉంటే ఖుషీరా.. విడిపోతే వ్యథేరా అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా దేవాదాయ శాఖ కార్యాలయంలో నోటికి నల్ల గుడ్డ కట్టుకొని నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఉద్యోగులు.

దేవాదాయ శాఖ 2
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు మరియు శాసన సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా దేవాదాయ శాఖ కార్యాలయంలో నోటికి నల్ల గుడ్డ కట్టుకొని నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఉద్యోగులు.

పయ్యావుల కేశవ్
తమను పోలీసులు అరెస్టు చేయడంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నినాదాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, ఇతరులు.

కూర్చున్న కేశవ్
తమను పోలీసులు అరెస్టు చేయడంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చున్న తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, ఇతరులు.

కలిసున్నాం...
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని రాసి ఉన్న ఓ ప్లకార్డు పట్టుకొని హైదరాబాదులో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు.

నినాదాలు
నాంపల్లి పోలీసు స్టేషన్ ఎదుట సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, ఇతరులు.












Click it and Unblock the Notifications