బాబు వస్తే కాలువ వంతెనపై పూలు పరిచారు (పిక్చర్స్)
ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కౌలు రైతుల ఖాతాల్లోకి బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలు జమ చేస్తామని హామీ ఇచ్చారు.
అన్నదాతలు, మత్స్యకారులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులుపడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని విమర్శించారు. తుపాను మీద తుపాను వచ్చి రైతులు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించకుండా ఎసి రూముల్లో కూర్చుంటున్నారని విమర్శించారు.
కనీసం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని భావిస్తే లెహర్ తుఫాన్ తర్వాత వస్తారని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదన్నారు. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయనకు రైతులు తమ సమస్యలను చెప్పుకున్నారు.

బాబు 1
చంద్రబాబు తన పర్యటనలో రైతులకు, వివిధ కులవృత్తుల వారికి హామీలిస్తూనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

బాబు 2
తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో వైయస్ జగన్‌తో పొత్తు పెట్టుకుని సోనియా గాంధీ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

బాబు 3
మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు రానున్నాయని టిడిపికి ఓటు వేసే బాధ్యత మహిళలు తీసుకుంటే మీరు తీసుకుంటే గ్రామాల్లో బెల్టులు మూయించే బాధ్యత తాను తీసుకుంటానని బాబు పేర్కొన్నారు.

బాబు 4
రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయకపోతే ప్రజల పరిస్థితి పెనంమీద నుండి పొయ్యిలో పడినట్టు అవుతుందని గుర్తించాలన్నారు.

బాబు 5
కాంగ్రెస్ వల్ల వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయన్నారు. రాష్ట్రంలో దళారీలు రాజ్యమేలుతున్నారన్నారు. సోనియాగాంధీని అండమాన్ నికోబార్‌కు పంపించాలన్నారు.

బాబు 6
కెసిఆర్, జగన్ ముసుగులో వస్తున్న సోనియా గాంధీకి తగిన బుద్ది చెప్పాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

బాబు 7
తెలుగుదేశం ఉండగా డ్వాక్రా మహిళలకు ఉచితంగా గ్యాస్ కనక్షన్ ఇచ్చేందుకు దీపం పధకాన్ని ప్రారంభించినని, తాను పెట్టిన ఆ దీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్పేసిందన్నారు.

బాబు 8
కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో విభజన సమస్య వచ్చిందన్నారు. రాష్ట్రప్రజలు బిచ్చగాళ్ళు, అనాథలు కారని ఇద్దరిని కూర్చోపెట్టి సమస్య పరిష్కరించండని తెలుగుదేశం పార్టీ చెబుతుందన్నారు.

బాబు 9
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను బాధితులను పరామర్శించారు.

బాబు 10
తాము అధికారంలోకి రాగానే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కౌలు రైతుల ఖాతాల్లోకి బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలు జమ చేస్తామని హామీ ఇచ్చారు.

బాబు 11
అన్నదాతలు, మత్స్యకారులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులుపడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని విమర్శించారు. తుపాను మీద తుపాను వచ్చి రైతులు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించకుండా ఎసి రూముల్లో కూర్చుంటున్నారని విమర్శించారు.

బాబు 12
కనీసం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని భావిస్తే లెహర్ తుఫాన్ తర్వాత వస్తారని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదన్నారు.

బాబు 13
యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబుకు రైతులు తమ సమస్యలను చెప్పుకున్నారు.

బాబు 14
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను బాధితులను పరామర్శించారు.

బాబు 15
తాము అధికారంలోకి రాగానే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కౌలు రైతుల ఖాతాల్లోకి బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలు జమ చేస్తామని హామీ ఇచ్చారు.

బాబు 16
అన్నదాతలు, మత్స్యకారులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులుపడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని విమర్శించారు. తుపాను మీద తుపాను వచ్చి రైతులు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించకుండా ఎసి రూముల్లో కూర్చుంటున్నారని విమర్శించారు.

బాబు 17
కనీసం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని భావిస్తే లెహర్ తుఫాన్ తర్వాత వస్తారని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదన్నారు.

బాబు 18
యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబుకు రైతులు తమ సమస్యలను చెప్పుకున్నారు.

Click it and Unblock the Notifications