గాంధీ భవన్లో కొట్టుకున్నారు, కాదని పొన్నాల (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం గాంధీ భవన్‌లో అడుగుపెట్టిన కొద్ది సేపటికే కార్యకర్తలు ముష్టిఘాతాలకు దిగారు. కుర్చీలు గాల్లోకి లేచాయి. అద్దాలు పగిలాయి. దీంతో పొన్నాల, ఉత్తమ్ విస్తుపోయారు.
ఎఐసిసి కార్యదర్శి, పార్టీ వ్యవహారాల పరిశీలకుడు కుంతియా, కేంద్ర మంత్రి బలరాం నాయక్ నిశ్చేష్టులయ్యారు. తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పొన్నాల, ఉత్తమ్ బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమానాశ్రయం వద్ద వారికి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు అత్యుత్సాహం చూపడంతో కొంతసేపు తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతున్నదని భావించిన పోలీసులు స్వల్ప లాఠీచార్జీతో వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత పొన్నాల, ఉత్తమ్ భారీ ర్యాలీతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అక్కడి నుంచి వారు రాత్రి ఏడు గంటలకు గాంధీ భవన్ చేరుకున్నారు.

గాంధీ భవన్
పొన్నాల, ఉత్తమ్‌లకు కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఇతర నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్‌లో ఘనస్వాగతం పలికారు. పొన్నాల, ఉత్తమ్ గాంధీ భవన్‌లో బొత్స చాంబర్‌లోకి వెళ్ళారు.

గాంధీ భవన్
పొన్నాల, ఉత్తమ్ మీడియానుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పడంతో విలేఖరులు కాన్ఫరెన్స్ హాలులో కూర్చున్నారు. ఎఐసిసి పరిశీలకుడు కుంతియా, కేంద్ర మంత్రి బలరాం నాయక్ వేదికపై కూర్చున్నారు. ఇంతలో ఓ నాయకుడు తన అనుచరులతో పొన్నాల, ఉత్తమ్‌లను సన్మానించేందుకు భారీ పూలదండలతో ఆ కాన్ఫరెన్స్ హాలులోకి వచ్చి నిలుచున్నారు.

గాంధీ భవన్
గాంధీ భవన్ ఉద్యోగి సుబ్బారావు ఇతరులు ఆ హాలులోకి రాకుండా నిలువరించేందుకు తలుపులు మూసేశారు. ఈ లోగా మరొకరు తలుపు తట్టడంతో, సుబ్బారావు తలుపు కొద్దిగా తీసి, విలేఖరుల సమావేశం జరగబోతున్నది కాబట్టి ఇతరులను అనుమతించనంటూ తలుపు పెట్టేందుకు యత్నించారు.

గాంధీ భవన్
కానీ అతను బలవంతంగా తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. ఆయన వెంట మరికొంత మంది దూసుకుని వచ్చారు. అప్పటికే ఆ హాలులో ఉన్న మరో నాయకుడి అనుచరులు లోపలకు వచ్చిన వ్యక్తిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి.

గాంధీ భవన్
కొంతమంది బయటకు పరుగెత్తి తమ నాయకుడిపై దాడి జరుగుతున్నదని నినాదాలు చేయడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నది.

గాంధీ భవన్
ఇదంతా జరుగుతున్న సమయంలోనే అక్కడికి పొన్నాల, ఉత్తమ్, దానం నాగేందర్ చేరుకున్నారు. దానం వారిని మందలించి అందరినీ బయటకు పంపించారు.

గాంధీ భవన్
జరిగిన ఘటనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షలు పొన్నాల తేలిగ్గా తోసిపుచ్చారు. కార్యకర్తల ఉత్సాహం అవధులు దాటిందని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

గాంధీ భవన్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం గాంధీ భవన్‌లో అడుగుపెట్టిన కొద్ది సేపటికే కార్యకర్తలు ముష్టిఘాతాలకు దిగారు. కుర్చీలు గాల్లోకి లేచాయి. అద్దాలు పగిలాయి. దీంతో పొన్నాల, ఉత్తమ్ విస్తుపోయారు.

గాంధీ భవన్
ఎఐసిసి కార్యదర్శి, పార్టీ వ్యవహారాల పరిశీలకుడు కుంతియా, కేంద్ర మంత్రి బలరాం నాయక్ నిశ్చేష్టులయ్యారు. తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పొన్నాల, ఉత్తమ్ బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

గాంధీ భవన్
విమానాశ్రయం వద్ద వారికి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు అత్యుత్సాహం చూపడంతో కొంతసేపు తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతున్నదని భావించిన పోలీసులు స్వల్ప లాఠీచార్జీతో వారిని చెదరగొట్టారు.

గాంధీ భవన్
ఆ తర్వాత పొన్నాల, ఉత్తమ్ భారీ ర్యాలీతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అక్కడి నుంచి వారు రాత్రి ఏడు గంటలకు గాంధీ భవన్ చేరుకున్నారు.












Click it and Unblock the Notifications