మీడియా పాయింట్: జర్నలిస్టుల ఆందోళన (పిక్చర్స్)
హైదరాబాద్: అసెంబ్లీ మీడియా కేంద్రం వద్ద ప్రజాప్రతినిధులకు రక్షణగా మంగళవారం బారికేడ్లను ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పీకర్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. సోమవారం కొందరు విలేకరులు తమపై దౌర్జన్యం చేశారని పలువురు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
వీడియో క్లిప్పింగులను పరిశీలించిన సభారతి రక్షణ ఏర్పాట్లు చేయాలంటూ పోలీసులను ఆదేశించడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని తీసి వేయాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు.
విలేకరుల ఆందోళనకు టిడిపి ఎమ్మెల్యేలు రఘునాథ రెడ్డి, లింగారెడ్డి, బిజెపి సభ్యులు నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తెరాస, సిపిఐ సభ్యులు హరీశ్ రావు, కూనంనేని తదితరులు సంఘీభావం ప్రకటించారు. దీంతో స్పీకర్ కొందరు విలేకరులను పిలిచి మాట్లాడారు. ఎమ్మెల్యేలపై కొందరు విలేకర్ల దౌర్జన్యం వాస్తవమేనని పోలీసులు చెప్పడంతో బారికేడ్లు తొలగించ లేదు. దీంతో, మీడియా పాయింట్‌ను బహిష్కరించాలని తెలంగాణ ప్రాంత విలేకర్లు కొందరు హల్‌చల్ చేసినా చివరికి పోలీసుల జోక్యంతో పరిస్థితి సర్దుకుంది.

అసెంబ్లీ 1
అసెంబ్లీ మీడియా కేంద్రం వద్ద ప్రజాప్రతినిధులకు రక్షణగా మంగళవారం బారికేడ్లను ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పీకర్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

అసెంబ్లీ 2
సోమవారం కొందరు విలేకరులు తమపై దౌర్జన్యం చేశారని పలువురు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వీడియో క్లిప్పింగులను పరిశీలించిన సభారతి రక్షణ ఏర్పాట్లు చేయాలంటూ పోలీసులను ఆదేశించడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ 3
వాటిని తీసి వేయాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు.

అసెంబ్లీ 4
విలేకరుల ఆందోళనకు టిడిపి ఎమ్మెల్యేలు రఘునాథ రెడ్డి, లింగారెడ్డి, బిజెపి సభ్యులు నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తెరాస, సిపిఐ సభ్యులు హరీశ్ రావు, కూనంనేని తదితరులు సంఘీభావం ప్రకటించారు.

అసెంబ్లీ 5
దీంతో స్పీకర్ కొందరు విలేకరులను పిలిచి మాట్లాడారు. ఎమ్మెల్యేలపై కొందరు విలేకర్ల దౌర్జన్యం వాస్తవమేనని పోలీసులు చెప్పడంతో బారికేడ్లు తొలగించ లేదు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సర్దుకుంది.












Click it and Unblock the Notifications