వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ సంచలనం: 'ఏపీ' షాక్, హావభావాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలపై వరాల వర్షం కురుపించారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని, బంగారం పైన రుణాలకు వర్తింపు చేస్తామని, ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇస్తామని, కేంద్ర ప్రభుత్వస్థాయి జీతాలు ఇస్తామని, 1969 నుండి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి, పదిలక్షల రూపాయలు ఇస్తామని, ఉద్యమకారుల పైన కేసులు ఎత్తివేస్తామని, దళిత, గిరిజన వధువులకు కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశ పెడుతున్నామని చెప్పారు.

1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకే బోధనా రుసుముల చెల్లింపు ఉంటుందన్నారు. ఉచిత నిర్బంధ విద్య, వైద్యం, గూడులేని వారికి భూమి, ఇల్లు, పంచాయతీలుగా తండాలు, వికలాంగులకు పెన్షన్.. ఇలా పలు నిర్ణయాలు ఈ కేబినెట్లో తీసుకున్నట్లు చెప్పారు. ఒక్కరోజే 43 కీలక నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ కేబినెట్ సంచలనం సృష్టించింది.

కేసీఆర్

కేసీఆర్

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలకు బుధవారం జరిగిన తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన మంత్రి వర్గం సమావేశం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీడియాకు వెల్లడించారు.

కేసీఆర్

కేసీఆర్

కాలపరిమితితో సంబంధం లేకుండా రైతులు తీసుకున్న పంట రుణాలు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. పంట రుణాల కోసం బంగారు తాకట్టు పెట్టిన రుణాలకు కూడా మాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కేసీఆర్

కేసీఆర్

రుణ మాఫీ వల్ల 35 లక్షల 7 వేల 409 రైతులకు లబ్ధి చేకూరుతుందని, దీని వల్ల ప్రభుత్వంపై 19 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను ఇవ్వడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ తెలంగాణ రాష్ట్ర ఇంక్రిమెంట్ ఇవ్వడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రభుత్వంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 40 వేల మంది సర్వీసులను రెగ్యులరైజు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేసీఆర్ తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజు చేయడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ స్థానంలో ‘ఫైనాన్సియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ' పథకం అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

ఈ ప్రాంతంలో 1956కు ముందు స్థిరపడిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆంధ్ర విద్యార్థులకు వర్తించదన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఆటో రిక్షాలు, వ్యవసాయ ట్రాక్టర్ల ట్రాలీలకు రవాణా పన్ను రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే బకాయిపడిన 56 కోట్ల పన్నును రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలను పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గిరిజన, లంబాడీ తండాలలో 500 మంది జనాభా కలిగిన వాటిని గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

వృద్ధులు, వితంతవులకు 1000, వికలాంగులకు 1500 రూపాయలకు ఫించన్లను పెంచుతున్నామని, అయితే ఇది దసరా పండుగనుంచి చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి రాష్ట్ర సలహా మండలి ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్టస్థ్రాయి కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఇలాంటి కమిటీలను జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేయన్నుట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు, గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ జిల్లాకు చెందిన కర్నే ప్రభాకర్‌ను మంత్రివర్గం ఎంపిక చేసిందని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలను అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేసామని ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

అయినా కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమీకరించి కేంద్రం పైన యుద్ధం చేస్తామని కెసిఆర్ హెచ్చరించారు.

కేసీఆర్

కేసీఆర్

ఎస్టీలకు, మైనార్టిలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేయడానికి కూడా మంత్రి వర్గం ఆమోదించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

రాష్ట్రంలో భూ కబ్జాదారులపై ఉక్కు పాదం మోపుతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. భూములన్నింటినీ సర్వే చేయించి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే తిరిగి స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

ల్యాంకో వంటి దొంగ సంస్థల అట కట్టిస్తమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ పేర్లు చెప్పి తప్పించుకోలేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

ఎపి భూదాన్ చట్టం కింద తెలంగాణ భూదాన్ చట్టం తెస్తామని ఆయన చెప్పారు. భూదాన్ భూములను కబ్జా చేసినవారు ఇచ్చేయాలని కేసీఆర్ అన్నారు. ఇక నుంచి భూకబ్జాదారుల ఆగడాలు సాగవని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాదులో 60 వేలకు పైగా అక్రమ భవనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. హైదరాబాదులో అంతూపొంతూ లేకుండా భూకబ్జాలు జరిగాయని ఆయన అన్నారు. ఇక నుంచి అలాంటివి సాగవని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

కబ్జాకు గురైన దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. హైదరాబాదులో పేకాట క్లబ్బులను ఏరివేస్తామని కేసీఆర్ చెప్పారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాదులో డంపింగ్ యార్డుల కోసం త్వరలో 2 వేల ఎకరాలు కేటాయిస్తామని కెసిఆర్ చెప్పారు. గృహనిర్మాణాల పథకంలో అక్రమాలు చేస్తే జైలుకు పంపిస్తామని ఆని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

లిక్కర్ లాబీ కోసం హైదరాబాదులో కల్లు దుకాణాలను మూసేశారని, హైదరాబాదులో కల్లు దుకాణాలను తెరిపిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని శాఖలకు తెలంగాణ పేరు పెడుతామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

టీవి చానెళ్ల ప్రసారాల నిలిపివేతలో ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కొత్త వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ చెప్పారు. విద్యార్థుల కోసం ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెడ్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసి దాన్ని ప్రవేశపెడ్తామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కెజి నుంచి పీజి వరకు ఉచిత విద్యను అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెద్ద కుంభకోణమని ఆయన అన్నారు.

English summary

 Announcing a platter of goodies for farmers, weaker sections, tribals and SC girls, Telangana Chief Minister K Chandrasekhar Rao said people would see the ‘Ugra Narasimha Avataram’ of his as he is trying to cleanse the system and not target individuals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X