వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో పాటు జగన్ కూడా, చూసి నవ్వారు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా టిడిపి సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్‌గా కోడెల ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి సభలో ప్రకటించారు. అనంతరం స్పీకర్‌గా కోడెల బాధ్యతలు స్వీకరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు వెంట రాగా స్పీకర్ పీఠంపై కోడెల కూర్చున్నారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోడెలకు సీఎం చంద్రబాబు, జగన్, మంత్రులు, అన్ని పార్టీల నేతలు అభినందనలు తెలిపారు.

ఎపి రాష్ట్రానికి మొదటి స్పీకర్‌గా కోడెల ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని చంద్రబాబు అభినందించారు. సమైక్యరాష్ట్రంలో అనేక మంత్రి పదవులు చేపట్టిన కోడెల ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రైతు నాయకుడిగా సమాజం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు తమరంటే ఎంతో అభిమానమన్నారు.

కోడెల

కోడెల

కోడెల శివప్రసాద్‌ను సభాపతి పీఠం వద్దకు తీసుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. కోడెలకు ముందుగా నడుస్తున్న బాబు. వెనుక వస్తున్న జగన్ నవ్వుతూ...

కోడెల

కోడెల

కోడెల శివప్రసాద్‌ను సభాపతి పీఠం వద్దకు తీసుకు వెళ్లిన అనంతరం.. కోడెల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం నమస్కరించుకుంటూ..

కోడెల

కోడెల

కోడెల శివప్రసాద్ సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడాతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

కోడెల

కోడెల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేస్తున్న దృశ్యం. ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.

కోడెల

కోడెల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి తినిపిస్తున్న దృశ్యం. ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.

English summary
Kodela Siva Prasad, Senior Telugudesam leader and MLA from Sattenapalli constituency of Guntur district, has taken over as the Speaker of AP Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X