విష్ణు కోసం భార్యా చెల్లి: ర్యాలీలో జయసుధ (పిక్చర్స్)
హైదరాబాద్: ఈ నెల 30వ తారీఖున తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటు అడుగుతున్నారు.
రోడ్డెక్కిన నాయకులు ఓటు అడుగుతూ... ఇళ్లలో బట్టలను ఇస్త్రీ చేస్తూ, మురికి కాలువలు దాటుతూ ప్రచారంలో దూసుకు పోతున్నారు.
ప్రచారంలో భాగంగా రోడ్ల పక్కన ఉన్న టీ బడ్డీ కొట్టుల్లో చాయ్ తాగుతూ, చిన్న చిన్న దుకాణాల్లో చల్లని పానియాలు తాగుతూ ఓట్ల కోసం అడుగులు వేస్తున్నారు.

విష్ణు
కాంగ్రెసు పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి తరఫున ఆయన భార్య, సోదరిలు ఓ కిరాణా దుకాణంలో ప్రచారం చేస్తున్న దృశ్యం.

విష్ణు
కాంగ్రెసు పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి తరఫున ఆయన భార్య, సోదరిలు నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న దృశ్యం.

విష్ణు
కాంగ్రెసు పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డికి ప్రచారంలో భాగంగా ఓ మహిళ బొట్టు పెట్టి ఆశీర్వాదం ఇస్తున్న దృశ్యం.

దానం
హైదరాబాదులోని ఖైరతాబాద్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి దానం నాగేందర్ తన నియోకవర్గంలో బుధవారం ప్రచారం చేస్తున్నప్పటి దృశ్యం.

దానం
హైదరాబాదులోని ఖైరతాబాద్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి దానం నాగేందర్ తన నియోకవర్గంలోని ఓ దేవాలయంలో నమస్కరిస్తున్న దృశ్యం.

దానం
హైదరాబాదులోని ఖైరతాబాద్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి దానం నాగేందర్ తన నియోకవర్గంలో ఇంటింటికి వెళ్లి ఓటు అడుగుతూ...

జైరాం
ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానిచ్చామని, దాని పునర్ నిర్మాణ బాధ్యతలు కూడా తమవేనని కేంద్ర మంత్రి జైరాం రమేష్ హామీ ఇచ్చారు.

జైరాం
భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని జైరాం తేల్చిచెప్పారు. జైరాంతో పాటు జయసుధ, అంజన్ కుమార్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

జైరాం
బుధవారం ఆర్టీసి క్రాస్‌రోడ్డలో ముషీరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని జైరాం ముఖ్య అతిధిగా హజరై ప్రారంభించారు.

జైరాం
స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి డా వినయ్, సికిందరాబాద్ ఎంపి అభ్యర్థి ఎం. అంజన్‌కుమార్‌యాదవ్, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, డిప్యూటీ మేయర్ జి. రాజ్‌కుమార్ స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు.

జైరాం
జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

జైరాం
ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వినయ్ బుధవారం ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు.

జైరాం
అడిక్‌మెట్ డివిజన్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పాదయాత్రల ఘట్టాన్ని ప్రారంభించారు. స్థానికంగా బస్తీలు, మురికివాడలు, కాలనీల్లో తన మద్దతుదారులతో కలిసి ప్రజాసమస్యలు అడిగి తెల్సుకున్నారు.

దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి, రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు.

దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి, రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో టిడిపి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి, రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం దృశ్యం.

దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి, రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం దృశ్యం.

దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి, రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం దృశ్యం. టిడిపి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

విహెచ్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు, అంబరుపేట అభ్యర్థి వి హనుమంత రావు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పటి దృశ్యం.

విహెచ్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు, అంబరుపేట అభ్యర్థి వి హనుమంత రావు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పటి దృశ్యం.

కిషన్ రెడ్డి
ఆరు దశాబ్దాల పోరాటాల అనంతరం ఏర్పడ్డ తెలంగాణను ఎవరు అభివృద్ధి చేయగలరన్న అంశంపై ప్రజలు తీవ్రంగా ఆలోచించి ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రచారంలో చెబుతున్నారు. ఆయన అంబరుపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

కిషన్ రెడ్డి
మొదటి నుంచి తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ విషయం ప్రజలందరికీ తెలుసునని, రెండు రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాలను కలిపిన పాపం కాంగ్రెస్‌దేనని కిషన్ అన్నారు.

కిషన్ రెడ్డి
వెయ్యి మంది బలిదానాల అనంతరం తెలంగాణ ఇచ్చి పాపాన్ని పరిహారం చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని కిషన్ చెబుతున్నారు. అంబరుపేట నియోజకవర్గంలో ముస్లిం మహిళను ఓటు అడుగుతున్న కిషన్, బండారు దత్తాత్రేయ.

ముఖేష్ గౌడ్
కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తన నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ఓ దుకాణంలో కోడిని పట్టుకొని ఫోజు ఇస్తున్న దృశ్యం.

ముఖేష్ గౌడ్
కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తన నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ఓ కిరాణా దుకాణంలో యజమానిని ఓటు అడుగుతున్న దృశ్యం.












Click it and Unblock the Notifications