బాబు ఐటీపై సీఎంలకు చెప్పాలి, కేసీఆర్ చురుగ్గా: కేంద్రమంత్రి
హైదరాబాద్: కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ఏపీ ముందుందని కొనియాడారు. ఏపీ సర్కారు ఇటీవల నిర్వహించిన ఈ-కేబినెట్ సమావేశంపై దేశమంతా ఆసక్తిగా ఉందన్నారు. విశాఖ ఐఐటీఆర్ పరిశీలనలో ఉందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు చొరవ తీసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ఇతర రాష్టరాల ముఖ్యమంత్రులకు మార్గదర్శనం చేయాలని రవిశంకర ప్రసాద్ కోరారు. రేషన్ సరుకుల పంపిణీకి ఆధార్ అనుసంధానం చేయడంతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందన్నారు. ఇతర పథకాల్లోని ఫలితాలొచ్చాయన్నారు.
కాగా, తెలంగాణలో మూడుచోట్ల, ఆంధ్రప్రదేశ్‌లో మూడుచోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో పోస్టల్ సర్కిల్ ఏర్పాటు చేస్తామని, విశాఖలో సి డాక్ సెంటర్ నెలకోల్పుతామన్నారు.
ఆంధ్రలో ఐటీ ఇన్వెస్టుమెంట్స్ రీజియన్ ఏర్పాటు చేస్తామని, దేశంలో ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించడం ద్వారా డిజిటల్ ఇండియా సాధిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తున్నామని, అటువంటి సంస్థను విశాఖలో నెలకోల్పే ప్రతిపాదన ఉందన్నారు. దేశ ప్రజల సౌకర్యార్ధం ఈ గ్రీటింగ్స్ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.
మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, మూడేళ్లలో అన్ని గ్రామ పంచాయతీలను హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో బ్రాడ్ బ్యాండ్ అనుసంథానం చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులతో సమావేశమయ్యానని, వారు చాలా చురుకుగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.

బాబుతో కేంద్రమంత్రి
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రికి బాబు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

బాబుతో కేంద్రమంత్రి
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. జ్ఞాపిక ఇస్తున్న బాబు

బాబుతో కేంద్రమంత్రి
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

కేసీఆర్
తెలంగాణలో మూడుచోట్ల, ఆంధ్రప్రదేశ్‌లో మూడుచోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇరు రాష్ట్రాల అభివృద్ధే కేంద్రం లక్ష్యమని, ఇరువురు ముఖ్యమంత్రుల ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తుందని, చాలా వరకూ వారి ప్రతిపాదనలను ఆమోదించే సానుకూల దృక్పథంతోనే కేంద్రం వ్యవహరిస్తోందని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ శాఖ, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులకు సంబంధించిన అధికారులతో కూడా తాను సమావేశమైనట్టు పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రాలు ఆంధ్రలో అనంతపురం, కాకినాడ, చిత్తూరులలో ఏర్పాటు చేస్తామని, అలాగే తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, మహేశ్వరం, మెదక్‌లలో నెలకొల్పుతామన్నారు. భారతదేశానికి విజ్ఞాన కేంద్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఐటీ, బీటీ, కమ్యూనికేషన్ రంగాల్లో రాణిస్తామని పేర్కొన్నారు.
దేశ ప్రజలు అంతా ప్రధాని ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఆరు నెలల్లో మోడీ ప్రభుత్వం పేదలే లక్ష్యంగా ఎన్నో చర్యలను చేపట్టిందన్నారు. ప్రధాని భారతీయ విద్యార్ధులతో సంభాషించడం ద్వారా కొత్త దృక్పధనికి తెరతీశారని, వారినుండి సలహాలు కోరినపుడు లక్షలాది కొత్త ఆలోచనలు వచ్చాయన్నారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో ధరలు అదుపులోకి వచ్చి, ఇంటా బయటా భారతీయుల ప్రతిష్ట పెరుగుతోందని చెప్పారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోయిందని, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తోందని, కాశ్మీర్‌లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తమ ఓటమికి కారణాలు ఏమిటో ఇప్పటికీ వెతుక్కునే స్థితిలో కాంగ్రెస్ లేదని ఇంకా పార్లమెంటును స్తంభింపచేయాలని చూస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఏవగించుకున్నారని రానున్న రోజుల్లో ఆ పార్టీకి నామరూపాలు కూడా ఉండవన్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications