బాబు ఆరా, పీఆర్ కండ్రికలో సచిన్ హల్‌చల్ (పిక్చర్స్)

హైదరాబాద్/నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు ఫోన్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు సచిన్‌ను చంద్రబాబు అభినందించారు.

అక్కడ కార్యక్రమాలు జరిగిన తీరు పైన ఆరా తీశారు. కుగ్రామాన్ని సచిన్ దత్తత తీసుకోవడం తనకు ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌.. సచిన్‌ సతీమణి అంజలి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వెంకటగిరి జరీచీరను బహూకరించారు. అలాగే గ్రామానికి చెందిన యువకులు క్రికెట్‌ బ్యాట్‌ నమూనా బహూకరించారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

భారత ప్రభుత్వం ప్రదానం చేసిన భారతరత్న పురస్కారాన్ని దేశంలోని తల్లులందరికీ అంకితమిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ మరోసారి ప్రకటించారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ఆయన దత్తత తీసుకున్న ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టంరాజువారి కండ్రిగలో ఆదివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, గ్రామ ప్రజలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. భారతీయ మహిళకు ప్రపంచ దేశాల్లో గొప్ప స్థానం ఉందన్నారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

తల్లిగా, చెల్లిగా, భార్యగా, దేశానికి వెన్నెముకగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటూ కొనియాడారు. పుట్టంరాజువారి కండ్రిగను అభివృద్ధి చేసి దేశంలోని ఆదర్శ గ్రామాల్లో అగ్రస్థానం అందుకునేలా చేస్తానని, అందుకే గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

గ్రామంలోని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, పెద్దవారు పరిశుభ్రంగా ఉండకపోతే పిల్లలు ఇబ్బందిపడతారని అంటురోగాలతో బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ఇక్కడి ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తామన్నారు. మహిళలు పొదుపుతో ఆర్థికాభివృద్ధి సాధించి పురుషులకు ఏమాత్రం తీసిపోమన్న విషయాన్ని చాటిచెప్పాలన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్


విమాన ప్రయాణంలో అనూహ్యంగా నెల్లూరు జాయింట్ కలెక్టర్ రేఖారాణి కలవడం, పుట్టంరాజువారి కండ్రిగ గ్రామం గురించి చర్చించడం జరిగిందని, గ్రామాభివృద్ధికి సంబంధించిన వివరాలను తనకు ఆమె తెలియచేయడంతో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు చెప్పారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామ ప్రగతికి సహకరించాలని సచిన్ టెండుల్కర్ కోరారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

మరోసారి పుట్టంరాజువారి కండ్రిగను సందర్శిస్తామంటూ, ఈసారి తనస ఇక్కడికి వచ్చేలోపే గ్రామ రూపురేఖలు మారి అభివృద్ధి కనిపిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మంత్రి పి నారాయణ, జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్, జెసి రేఖారాణి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశెం సునీల్‌కుమార్, క్రికెట్ అసోసియేషన్ నాయకులు చాముండేశ్వరనాథ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

సచిన్‌ టెండూల్కర్‌తో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘబంధాల మహిళలు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ముందుగా సచిన్‌ సంఘబంధ మహిళలను ఉద్ధేశించి తెలుగులో నమస్కారం అన్నారు. అనంతరం ముఖాముఖి సందర్భంగా సభ్యురాలు జ్యోతి సచిన్‌కు సంఘబంధాల పనితీరును వివరించారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

పది మంది పొదుపు మహిళలతో గ్రూపుగా సంఘబంధాలుగా ఏర్పాటయ్యామన్నారు. నెర్నూరు పంచాయతీలో 44 సంఘాలు ఉన్నాయన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ప్రతి నెలా ఒక్కో సంఘం నుంచి రూ. 1000 వంతున పది మంది బ్యాంకులో పొదుపు చేస్తామన్నారు. ఆరు నెలల అనంతరం ఒక్కో సంఘానికి రూ. 50వేల వంతున మొదటి విడత రుణాలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను వినియోగిస్తామన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ప్రతి నెలా రెండు సార్లు సమావేశం నిర్వహిస్తామని, సంఘాల బలోపేతానికి కలెక్టర్‌ శ్రీకాంత్‌ సూచనల మేరకు వారానికి ఓ సమావేశం చొప్పున నెలకు నాలుగు సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ఈ సమావేశాల్లో పొదుపు మహిళలు తీసుకోవాల్సిన చర్యలు, సామాజిక కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. అక్షరాస్యత పెంపుదల, బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలకు పంపడం, గ్రామంలోని మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తామన్నారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

రెండో విడతగా బ్యాంకు నుంచి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు పొంది సంఘ సభ్యుల అభివృద్ధికి వినియోగిస్తామని ఆమె తెలిపారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

అనంతరం కలెక్టర్‌ శ్రీకాంత్‌, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళిలు పొదుపు మహిళలు గ్రామ సంఘాల నుంచి మండల, జిల్లా సమాఖ్యల ఏర్పాటు వరకు రూపొందించిన ప్లెక్సిని సచిన్‌కు అర్థమయ్యేలా వివరించారు. మహిళలనుద్ధేశించి సచిన్‌ మాట్లాడుతూ మహిళలే దేశానికి వెన్నుముక అన్నారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు ఆయిన సచిన్‌ టెండూల్కర్‌ దత్తత తీసుకున్న పుట్టంరాజు కండ్రిగ(పీఆర్‌ కండ్రిగ) గ్రామం అభివృద్ధిలో దేశానికే తలమానికంలా నిలుస్తుందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ఆదివారం సచిన్‌తో కలిసి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సచిన్‌ ఎంపీ నిధుల నుంచి మొదటి విడతలో భాగంగా రూ. 2.79 కోట్లు విడుదల చేస్తారన్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

పుట్టంరాజుకండ్రిగను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిపరుస్తామని కలెక్టర్‌ శ్రీకాంత్‌ అన్నారు. ఇప్పటికే 24 గంటల విద్యుత్‌, తాగునీరు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌, కాంపోజిట్‌ పిట్‌లు, సిమెంటు రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

భారత ప్రభుత్వం ప్రదానం చేసిన భారతరత్న పురస్కారాన్ని దేశంలోని తల్లులందరికీ అంకితమిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ మరోసారి ప్రకటించారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ఆయన దత్తత తీసుకున్న ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టంరాజువారి కండ్రిగలో ఆదివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+