రాష్ట్రపతికి ఐకాస విన్నపం: జై జగన్-సేవ్ ఎపి (పిక్చర్స్)

హైదరాబాద్/విశాఖపట్నం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఎపిఎన్జీవోలు సోమవారం చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని బస్టాండు వద్ద ధర్నాకు దిగారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ప్రణబ్ ముఖర్జీ రాక నేపథ్యంలో వారు ఆయనకు విజ్ఞప్తుల ఫ్లెక్సీలు కట్టారు.

రాష్ట్రపతి గారికి విన్నపం అంటూ... రాష్ట్రం విడిపోతే మూడు ప్రాంతాలు అన్ని విధాలుగా నష్టపోతాయని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు. విడిపోతే మూడు ప్రాంతాల ప్రజలు విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, నీటి, విద్యుత్ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

మరోవైపు విశాఖపట్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నేటి పరిస్థితుల్లో... ఉత్తరాంధ్ర పైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

తిరుపతి

తిరుపతి

ఎపిఎన్జీవోస్ ఎపిఎస్ ఆర్టీసి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి వినతులతో ధర్నా చేస్తున్న దృశ్యం.

ఏయు

ఏయు

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నేటి పరిస్థితుల్లో.. ఉత్తరాంధ్ర పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సమైక్యాంధ్ర

సమైక్యాంధ్ర

రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ జై సమైక్యాంధ్ర అంటూ విశాఖపట్నంలో నినాదాలు చేస్తున్న సమైక్యవాదులు.

ఐకాస

ఐకాస

రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న సమైక్యవాదులు.

జై జగన్ - సేవ్ ఎపి

జై జగన్ - సేవ్ ఎపి

విశాఖపట్నంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో ఎపి చిత్రాన్ని వేసి జై జగన్ - సేవ్ ఎపి అంటూ రాసిన దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+