కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప హత్యల మిస్టరీ: భార్యకు వేరొకరితో...! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: కడపలో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసిన విషయం తెలిసిందే. కడపలోని నబీకోటలో బియోన్ ఇంగ్లీష్ పాఠశాల నిర్వహిస్తున్న కృపాకర్.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంచనల సంఘటన వివరాలను జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ మంగళవారం రాత్రి విలేకరులకు వెల్లడించారు. ఓ కుటుంబం అదృశ్యమమై ఏడాది దాటినా వారి జాడ లేకపోగా, వారు హత్యకు గురై ఉంటారని భావిస్తున్న తరుణంలో చివరకు అదే నిజమైంది.

ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా పూర్తి వివరాలు తెలిశాయని తెలుస్తోంది. మంగళవారం అశ్తిపంజరాలను వెలికి తీశారు. కడపలో జియోన్ విద్యా సంస్థల అధినేత, జిల్లా శాంతి సంఘం వ్యవస్థాపక కార్యదర్శి రాజారత్నం రెండో కుమారుడు కృపాకర్. పదేళ్ల కిందట మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

తండ్రి కుటుంబంతో కలిసి కృపాకర్ కుటుంబం కూడా జియోన్ పాఠశాల ఆవరణలోని ఇంట్లోనే ఉంటోంది. కొంతకాలంకా కృపాకర్, భార్య మౌనిక మధ్య గొడవలు జరిగాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో కృపాకర్ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఫిబ్రవరి 22న మౌనికను చీరతో ఉరివేసి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని తన వద్ద నమ్మకంగా పని చేసే డ్రైవర్ సహాయంతో పాఠశాల ఆవరణలోనే పూడ్చి పెట్టారు.

కడప హత్యలు

కడప హత్యలు

అలాగే మౌనికతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చంపేందుకు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

కడప హత్యలు

కడప హత్యలు

భార్య హత్య ఘటన అనంతరం మానసికంగా ఆందోళనకు గురైన కృపాకర్.. పిల్లను ఎవరి వద్ద అయినా ఉంచాలని విఫలమయ్యాడు.

కడప హత్యలు

కడప హత్యలు

చివరకు పిల్లలు కూడా అమ్మ ఏదని అడగడంతో.. ఏప్రిల్ 19న రాత్రి డ్రైవర్ సాయంతో పాఠశాలలోని ఒఖ గదిలోకి ఒక్కొక్కరిని తీసుకెళ్లి చీరతో ఉరివేసి ముగ్గురిని హత్య చేశారు.

కడప హత్యలు

కడప హత్యలు

అనంతరం అదే రాత్రి కృపాకర్ కూడా పాఠశాల గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ కృపాకర్ తండ్రి రాజారత్నంకు తెలియడంతో వెంటనే మృతదేహాలన్నింటిని పాఠశాల ఆవరణలోనే పూడ్చి పెట్టించాడు.

కడప హత్యలు

కడప హత్యలు


వాటిని మౌనికను పూడ్చి పెట్టిన చోటనే పూడ్చి పెట్టారు. అయితే, తనకు ఏమీ తెలియనట్లుగా రాజారత్నం ఉన్నాడని తెలుస్తోంది. తన రెండో తనయుడి కుటుంబం ఎక్కడికి వెళ్లిందోనని చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు.

కడప హత్యలు

కడప హత్యలు

అయితే, మౌనిక తల్లి దీని పైన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె రాజారత్నం పైనే ఫిర్యాదు చేశారు. అయితే, చివరకు కొత్తగా వచ్చిన ఎస్పీ నవీన్ గులాఠీని ఆమె కలిసి ఈ మధ్య మరోసారి ఫిర్యాదు చేశారు.

కడప హత్యలు

కడప హత్యలు

ఎస్పీ ఆదేశాలతో ఈ ఏడాది ఆగస్టు 5న కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. కేసును చేధించారు. కాగా, రాజారత్నం సోమవారం రాత్రే చెన్నైకి పారిపోయి, అనారోగ్యమంటూ ఆసుపత్రిలో చేరాడు.

కడప హత్యలు

కడప హత్యలు

కాగా, ఈ హత్యోదంతంలో కీలక నిందితునిగా రామాంజనేయుల రెడ్డిని అరెస్టు చేశారు. రాజారత్నం భార్య, కుమారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కడప హత్యలు

కడప హత్యలు

అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్న రాజారత్నంను అదుపులోకి తీసుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్పీ పంపించారు.

కడప హత్యలు

కడప హత్యలు

ఏడాదిన్నర క్రితం అదృశ్యమయ్యారని భావిస్తున్న రాజారత్నం ఐజాక్‌ కుమారుడు, కోడలు, మనవల మృతదేహాలను జియోన్‌ పాఠశాలలో పూడ్చిపెట్టిఉండగా మంగళవారం పోలీసులు తవ్వి వెలికి తీశారు.

కడప హత్యలు

కడప హత్యలు

మౌనిక అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు రాజారత్నం కుమారుడు కృపాకర్‌... ఆమె ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి హత్యకు పాల్పడ్డాడు.

కడప హత్యలు

కడప హత్యలు

తర్వాత మానసికంగా కుంగిపోయి తన ముగ్గురు పిల్లలు ఏంజిల్‌ (9), రాజు (7), పవిత్ర (5)లను హత్య చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

కడప హత్యలు

కడప హత్యలు

వీరందరి శవాలనూ జియోన్‌ పాఠశాల ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారు. మౌనిక తల్లి సుజాత ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ నవీన్‌ గులాఠీ ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించారు.

కడప హత్యలు

కడప హత్యలు

మృతి చెందిన కృపాకర్, మౌనిక దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు అమ్మాయిలు (ఏంజిల్, పవిత్ర), ఒకరు అబ్బాయి (రాజు)

కడప హత్యలు

కడప హత్యలు

కేసు పైన పోలీసులు దృష్టి పెట్టడంతో నిందితుడైన డ్రైవర్ రామాంజనేయులు రెడ్డి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతనిని పోలీసులు పట్టుకున్నారు.

కడప హత్యలు

కడప హత్యలు

మంగళవారం పోలీసులు పది అడుగుల లోతున పూడ్చి పెట్టిన అయిదుగురి మృతదేహాల అస్తి పంజరాలను బయటకు తీశారు. అవి ఇద్దరు పెద్దవారు, ముగ్గురు పిల్లలవని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.

English summary

 Photos of Serial murder mystery in Kadapa of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X