Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PIC TALK : ఆప్యాయంగా చంద్రబాబు - దగ్గుబాటి : ఒకే వేదికపై వారంతా కలిసి- జూ ఎన్టీఆర్ ఎక్కడ..!!

ఈ ఫొటో ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కేక పుట్టిస్తోంది. ఈ మధ్య కాలంలో అరుదైన చిత్రంగా వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు - ఆయన తోడల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఒకే వేదిక మీద కనిపించారు. అంతే కాదు..ఇద్దరూ పక్క..పక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహం జరుగుతోంది. అందులో భాగంగా పెళ్లి కుమార్తెగా చేసే సమయంలో వారింటికి నారా - నందమూరి- దగ్గుబాటి కుటుంబాలు అక్కడకు చేరుకున్నాయి.

ఒకే వేదిక మీదకు చంద్రబాబు- దగ్గుబాటి

ఒకే వేదిక మీదకు చంద్రబాబు- దగ్గుబాటి


నందమూరి కుటుంబలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు పెద్దిరికంగా నిలబడి అన్నీ తానై వ్యవహరించటం ఎప్పటి నుంచో ఉంది. అదే విధంగా దగ్గుబాటి దంపతులు బాధ్యతలు తీసుకుంటారు. పురంధేశ్వరి - భువనేశ్వరి ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెళ్లి సంబంధాల మొదలు..అన్నీ కార్యక్రమాలు దగ్గర నుంచి నిర్వహిస్తారు. దీంతో..ఇప్పుడు ఈ మూడు కుటుంబాలు వివాహం కోసం ఒకే చోటకు చేరారు. 1995లో ఎన్టీఆర్ ను పదవి కోల్పోవటం..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయం లో నారా - దగ్గుబాటి కుటుంబాలు కలిసే ఉండేవి.

ఆత్మీయంగా- ఆప్యాయంగా

ఆత్మీయంగా- ఆప్యాయంగా


ఆ ఘటన తరువాత దగ్గుబాటి - చంద్రబాబు మద్య విభేదాల కారణంగా వారు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. వేంకటేశ్వర రావు ఎమ్మెల్యేగా.. పురంధేశ్వరి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మన్మోహన్ ప్రభుత్వంలో పురంధేశ్వరి మంత్రిగా పని చేసారు. రెండు విడతల్లోనూ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక, ఆ తరువాత దగ్గుబాటి వేంకటేశ్వరరావు వైసీపీలో చేరినా.. కొంత కాలంగా దూరంగానే ఉంటున్నారు. ఇక, అప్పటి నుంచి ప్రత్యేక సందర్బాల్లో చంద్రబాబు - దగ్గుబాటి ఒకే చోటకు వచ్చినా..అంతగా సఖ్యత కనిపించేది కాదని చెప్పేవారు.

నారా- నందమూరి-దగ్గుబాటి ఒకే వేదిక మీదకు

నారా- నందమూరి-దగ్గుబాటి ఒకే వేదిక మీదకు


అయితే, ఇప్పుడు ఈ వేడుకలో మాత్రం ఇద్దరు పాతవి అన్నీ మరిచిపోయినట్లుగా..కలిసిపోయినట్లుగా కనిపించారు. ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అదే వేదిక మీద పురంధేశ్వరి- భువనేశ్వరి సైతం ఉన్నారు. ఇక, నందమూరి - నారా - దగ్గుబాటి కుటుంబ సభ్యులు కలిసి గ్రూపు ఫొటోలు దిగారు. అందులో అఖండి విజయం తో ఊపు మీద ఉన్న బాలయ్య సైతం ఉన్నారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం అక్కడే ఉంది.

Recommended Video

    Prabhas Rs 1 CR Donation Again Like KING Of Heroes | Radhe Shyam || Oneindia Telugu
    జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ

    జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ

    కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. ఎన్టీఆర్ కమార్తెలు- అళ్లుల్లు, అదే విధంగా కుమారులు - కోడళ్ల జనరేషన్ వరకు మాత్రమే ఫొటోల్లో ఉన్నారు. ఈ పొటోలో లోకేశ్... బ్రాహ్మణి...జూ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. అయితే, చంద్రబాబు - దగ్గుబాటి ఒకే వేదిక మీదకు రావటం మాత్రం భవిష్యత్ రాజకీయాలకు..పరిణామాలకు కీలకంగా మారుతుందనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+