• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్రీడాకారుల విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఇక నుండి వారికి మంచి రోజులే

|

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు క్రీడాకారుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఆయన తీసుకున్న నిర్ణయంపై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేస్తుంది. ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటూ పాలనలో తనదైన మార్కు చూపించాలని తాపత్రయ పడుతున్న జగన్ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం క్రీడా రంగానికి జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చెప్తుంది.

క్రీడారంగానికి జగన్ వరాలు ... రేపటి నుండే అమలు

క్రీడారంగానికి జగన్ వరాలు ... రేపటి నుండే అమలు

ఒకపక్క తెలుగుతేజం పీవీ సింధు అంతర్జాతీయంగా స్వర్ణ పతకం సాధించి భారత్ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.రాష్ట్రంలో క్రీడలకు కొత్త శోభను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం తో పాటుగా, రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేయడంలో పాత్ర పోషిస్తున్న క్రీడాకారులకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ క్రీడాకారుల పట్ల జగన్ కు ఉన్న ప్రత్యేకమైన దృష్టి ని చాటి చెబుతుంది. అంతేకాకుండా కొత్తగా క్రీడల్లో ప్రవేశించే క్రీడాకారులకు కూడా ఈ నిర్ణయం ఎంతగానో ప్రోత్సాహం ఇస్తుందన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఇంతగా అందరినీ ఆకట్టుకునేలా క్రీడలకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే..

క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని జగన్ సర్కార్ నిర్ణయం

ఈ నెల 29న అంటే రేపు నిర్వహించనున్న క్రీడా దినోత్సవంలో భాగంగా ఇప్పటిదాకా క్రీడల్లో సత్తా చాటిన క్రీడాకారులకు నగదు నజరానాలు అందించనున్నట్లుగా జగన్ ప్రకటించారు. నవ్యాంధ్ర ఏర్పడ్డ నాటి నుంచి అంటే 2014 నుంచి క్రీడల్లో సత్తా చాటిన వారందరికీ ఈ ప్రోత్సాహకాలు అందిస్తామని జగన్ పేర్కొన్నారు. దీంతో క్రీడాకారులలో సంతోషం వెల్లివిరుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించేలా, క్రీడా రంగాన్ని ప్రోత్సహించేలా, ఈ రంగంలోకి వస్తున్న వారికి ఆసక్తిని కలిగించే లా జగన్ తీసుకున్న నిర్ణయం ఈ ఒక్క సంవత్సరం మాత్రమే కాకుండా ప్రతి ఏటా అమలయ్యేలా చూడనున్నారు .

ప్రతిఏటా నగదు ప్రోత్సాహకంతో పాటు సత్తా చాటిన క్రీడాకారులకు ఘనంగా సన్మానం .. జగన్ కీలక నిర్ణయం

ప్రతిఏటా నగదు ప్రోత్సాహకంతో పాటు సత్తా చాటిన క్రీడాకారులకు ఘనంగా సన్మానం .. జగన్ కీలక నిర్ణయం

క్రీడాకారుల కోసం ఈ తరహా కార్యక్రమాన్ని చేపడతామని నగదు పురస్కారాలు ప్రోత్సాహకాలు కూడా ఏటా క్రమం తప్పకుండా అందిస్తామని కూడా జగన్ పేర్కొన్నారు. నగదు పురస్కారాలతో పాటు క్రీడల్లో తమదైన శైలి సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరిస్తామని కూడా జగన్ ప్రకటించారు. మొత్తంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పీవీ సింధు స్వర్ణపతకం సాధించి అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇక తాజాగా జగన్ ప్రభుత్వం క్రీడాకారుల కోసం తీసుకున్న నిర్ణయం రాష్ట్రం నుంచి పీవీ సింధు, సాయి ప్రణీత్ వంటి క్రీడా మాణిక్యాలను తయారు చేయడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YCP chief YS Jagan Mohan Reddy has now made a sensational decision on the players. The latest decision by Jagan says that Jagan is giving priority to the sports sector. It has been decided to provide cash incentives to the players and sportsmanship awards every year on sports day .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more