యువతిపై ఘాతుకం: ఆర్మీ జవాన్లు వీరే (పిక్చర్స్)
హైదరాబాద్: ముగ్గురు సైనికులు ఓ యువతిపై హైదరాబాదులో లైంగిక దాడికి పాల్పడడానికి ప్రయత్నించిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రక్షించాల్సిన సైనికులే కాటు వేయడానికి యత్నించిన విషయం తెలిసిందే.
సికింద్రాబాద్‌లోని మహింద్రా హిల్స్ సమీపంలో టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతి, ఆమె స్నేహితుడు ఆదివారం రాత్రి గుడికి వెళ్ళారు. అనంతరం అక్కడ దగ్గరలో ఉన్న తోటలో ఇరువురు కూర్చుని మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన ముగ్గురు సైనికులు యువతి స్నేహితుడుపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం యువతిపై అత్యాచార యత్నం చేయబోయారు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది.
గాయపడిన ఆమె స్నేహితుడు కాలనీకి వెళ్ళి స్థానికులు సహాయంతో తుకారం గేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. దీంతో రక్షక్ పోలీసులు హుటాహిటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని ముగ్గురు సైనికులను స్పాట్‌లో పట్టుకుని, వారిపై కేసు నమోదు చేశారు. సైనికులను పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు తర్వాత..
17 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఆర్మీ జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాదులోని మహీంద్ర హిల్స్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 001.jpg

చేసుకున్నవారికి చేసుకున్నంత..
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లు చేసిన తప్పుకు అనుభవించకతప్పదు. యువతి తన స్నేహితుడితో కలిసి ఆలయాన్ని సందర్శించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా ఆర్మీ జవాన్లు ఘాతుకానికి ఒడిగట్టే ప్రయత్న చేశారు.

ఆ ముగ్గురు వారే...
యువతిపై దారుణానికి ఒడిగట్టిన ఆర్మీ జవాన్లను లోక్ బహదూర్ ఛాటీ (20) అస్సాంకు చెందిన హవల్దార్ కాగా, తపస్ మైతీ (29), సులన్ నర్జారీ (23) సిపాయిలు. వీరిద్దరు కూడా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. వీరు ముగ్గురు సికింద్రాబాదులోని ఆర్మీ ఆర్డీనెన్స్ కార్ప్స్ (ఎఒసి)లోని రెడో శిక్షణా బెటాలియన్‌లో పనిచేస్తున్నారు.

స్థానికులు రావడంతో పారిపోయారు...
తన స్నేహితురాలిపై ముగ్గురు జవాన్లు లైంగిక దాడికి పాల్పడడానికి ప్రయత్నించడంతో యువకుడు స్థానికుల సహాయం తీసుకోవడానికి ప్రయత్నించాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడం గమనించిన ఆర్మీ జవాన్లు పారిపోయారు.












Click it and Unblock the Notifications