కిడ్నీ రాకెట్‌పై నిరసన, దిష్టిబొమ్మ దగ్ధం (పిక్చర్స్)
విశాఖపట్నం: కిడ్నీ రాకెట్ ఉదంతంపై విశాఖపట్నంలో బుధవారం నిరసన వెల్లువెత్తింది. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని ఎఐటియుసలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల రమణ డిమాండ్ చేశారు.
కిడ్నీ రాకెట్‌ను నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇందులో ప్రమేయం ఉన్న డాక్టర్లను శిక్షించి, ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని రమణ కోరారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంతో సంబంధం ఉన్న సెవెన్ హిల్స్ ఆస్పత్రి వ్యవహారంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) మాట్లాడకపోవడంపై సమైక్యాంధ్ర పొలిటికల్ జెఎసి కన్వీనర్ జెటి రామారావు మండిపడ్డారు.
సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఎదుట ఎంసిఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అవయవాలతో వ్యాపారం చేసుకుంటున్నా ఎంసిఐ, విద్యాధికారులు, పట్టించుకోకపోవడాన్ని ఆయన నిరసించారు.

సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఇదే...
కిడ్నీ రాకెట్ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కుంటున్న విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఇదే.

దిష్టిబొమ్మ దగ్ధం
కిడ్నీ రాకెట్‌ను నిరసిస్తూ బుధవారంనాడు సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకారులు ఎంసిఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

కిడ్నీ రాకెట్ వ్యవహారంతో...
కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు కావడంతో విశాఖపట్నంలో సెవెన్ హిల్స్ ఆస్పత్రి వార్తల్లోకి ఎక్కింది.

చర్యలేవీ...
కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయినప్పటికీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోరు విప్పకపోవడాన్ని ఆందోళనకారులు నిరసించారు.












Click it and Unblock the Notifications