బాలు మోశారు: బాపుకు కన్నీటి వీడ్కోలు (పిక్చర్స్)

చెన్నై: ప్రముఖ దర్శకుడు బాపు భౌతిక కాయానికి మంగళవారం తమిళనాడు రాజధాని చెన్నైలో అంత్యక్రియలు జరిగాయి. పలువురు చిత్ర ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోళ్ల మధ్య స్థానిక బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన భౌతికకాయానికి దహనక్రియలు నిర్వహించారు.

తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య, సినీ నటులు మోహన్‌బాబు, రావి కొండలరావు, నాగినీడు, సంగీత, బోనీకపూర్‌, అనిల్‌కపూర్‌, గుండు సుదర్శనం, నేపథ్యగాయకులు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం, నాగూర్‌బాబు, రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల, సినీ దర్శకుడు వంశీ, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు మంగళవారం బాపు భౌతికకాయానికి నివాళులర్పించారు.

‘శ్రీరామరాజ్యం' సినిమాలో లవ, కుశ, బాలహనుమాన్‌ పాత్రధారులైన గౌరవ్‌, ధనుష్‌, పవన్‌శ్రీరాం బాపు పార్థివదేహానికి అంజలి ఘటించడాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాపు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించింది. అలాంటిదేమీ లేకుండానే అంత్యక్రియలు ముగిశాయి.

బాలు ఇలా...

బాలు ఇలా...

బాపు ఇద్దరు కుమారులతో పాటు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అంతిమయాత్రలో భుజం పట్టి ఆయన భౌతికకాయాన్ని వైకుంఠవాహనం వరకూ మోశారు.

మోహన్ బాబు ఇలా...

మోహన్ బాబు ఇలా...

ప్రముఖ సనీ నటుడు మోహన్ బాబు బాపు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

మోహన్ బాబు పరామర్శ

మోహన్ బాబు పరామర్శ

బాపు కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. బాపు అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు.

రోశయ్య నివాళి...

రోశయ్య నివాళి...

ప్రముఖ దర్శకుడు బాపు భౌతిక కాయాన్ని తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య సందర్శించి నివాళులు అర్పించారు.

మండలి బుద్ధప్రసాద్ నివాళి

మండలి బుద్ధప్రసాద్ నివాళి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బాపు భౌతిక కాయాన్ని సందర్శించిన నివాళులు అర్పించారు.

పల్లె రఘునాథ రెడ్డి నివాళి

పల్లె రఘునాథ రెడ్డి నివాళి

ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ప్రముఖ దర్శకుడు బాపు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

పల్లె రఘునాథ రెడ్డి ఇలా...

పల్లె రఘునాథ రెడ్డి ఇలా...

బాపు అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తుందని భావించారు. కానీ అలాంటిదేమీ లేకుండా అంత్యక్రియలు జరిగిపోయాయి.

బోనీ కపూర్ నివాళి

బోనీ కపూర్ నివాళి

తన సోదరుడు అనిల్ కపూర్ రావడానికి ముందే ఆయన సోదరుడు బోనీకపూర్‌ బాపు నివాసానికి చేరుకుని బాపుకు అంజలి ఘటించారు.

బాపు కుమారులతో బోనీ కపూర్...

బాపు కుమారులతో బోనీ కపూర్...

బాపు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన బోనీ కపూర్ బాపు కుమారులను పలకరించి, పరామర్శించారు.

అనిల్ కపూర్ నివాళి..

అనిల్ కపూర్ నివాళి..

బాపు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌, ఆయన సోదరుడు బోనీ కపూర్‌ బాపుకు ఘనంగా నివాళులర్పించారు.

అనిల్ కపూర్ తెరంగేట్రం

అనిల్ కపూర్ తెరంగేట్రం

తెలుగులో బాపు రూపొందించిన ‘వంశవృక్షం' సినిమా ద్వారా అనిల్‌కపూర్‌ చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత హిందీలోనూ బాపు దర్శకత్వంలోనే అనిల్‌ కపూర్‌ తెరంగేట్రం చేశారు.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హుటాహుటిన చెన్నై చేరుకుని ప్రముఖ దర్శకుడు బాపు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+