తెలంగాణలో సినీ గ్లామర్ తక్కువే, వీరే (పిక్చర్స్)
హైదరాబాద్: సినీ పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా విస్తరించినప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో సినీ గ్లామర్ నామమాత్రంగానే కనిపిస్తోంది. ఎటు చూసినా ముగ్గురంటే ముగ్గురే కనిపిస్తున్నారు. జయసుధ, బాబూమోహన్, విజయశాంతి తప్ప వెతికినా సినీ గ్లామర్ కనిపించడం లేదు.
ఆ ముగ్గురు కూడా కేవలం గ్లామర్ మీదనే ఆధారపడకుండా తమ రాజకీయ నిబద్ధతల ద్వారా కూడా ప్రముఖ నాయకులుగా ముందుకు వచ్చారు. తెలుగు సినిమాల్లో హాస్యపాత్రలు పోషించిన బాబూ మోహన్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
లేడీ అమితాబ్‌గా, రాములమ్మగా పేరు గాంచిన విజయశాంతి మొదట బిజెపిలో ఉండి, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కోసం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. జయసుధ సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా విజయం సాధించారు.

తెలంగాణ రాములమ్మ విజయశాంతి..
తెలంగాణ రాములమ్మగా పేరు గాంచిన విజయశాంతి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమించారు. ఆమె గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మెదక్ శాసనసభా స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

వైయస్ ద్వారా జయసుధ
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా కాంగ్రెసు పార్టీలో చేరి, సికింద్రాబాద్ శాసనసభా స్థానం నుంచి పోటీ చేసి జయసుధ విజయం సాధించారు. మరోసారి సికింద్రాబాద్ నుంచి తన జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు.

బాబూ మోహన్ తెరాసలోకి..
తెలుగుదేశం పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆందోల్ నుంచి పోటీ చేసి విజయం సాధించి, మంత్రిగా కూడా బాబూ మోహన్ పనిచేశారు. గత ఎన్నికల్లో దామోదర రాజనర్సింహపై ఓడిపోయారు. ఇప్పుడు తెరాస అభ్యర్థిగా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

వేణు మాధవ్ ప్రయత్నించారు..
ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ తెలంగాణకు చెందినవాడైనప్పటికీ తెలుగుదేశం తరఫున సీమాంధ్రలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ మామ
ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ శేఖర్ రెడ్డి తెరాస అభ్యర్థిగా ఇబ్రహీం పట్నం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే శేఖర్ రెడ్డికి అల్లు అర్జున్ గ్లామర్ ఉపయోగపడుతుందో లేదో చెప్పలేం.












Click it and Unblock the Notifications