వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓయులో పోటాపోటీ ర్యాలీలు: ఘర్షణ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆందోళనలతో అట్టుడుకుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓయు విద్యార్థులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.

తాజాగా శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త వాతావరణ తలెత్తింది. ఓయూలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడాన్ని స్వాగతిస్తూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించగా, మరో వైపు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయద్దంటూ నిరుద్యోగ యువత మరో ర్యాలీ చేపట్టింది.

పోటాపోటీ ర్యాలీలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు కలుగజేసుకుని గొడవను సర్దిపుచ్చే ప్రయత్నం చేపట్టారు.

ఓయులో ఉద్రిక్తత

ఓయులో ఉద్రిక్తత

కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యార్థులు వేర్వేరుగా ర్యాలీలు తీయడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీ

కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీ

కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.

విద్యార్థుల ర్యాలీ

విద్యార్థుల ర్యాలీ

కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీకి పోటీగా విద్యార్థులు క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పోటాపోటీ ర్యాలీలు

పోటాపోటీ ర్యాలీలు

కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం పోటాపోటీ ర్యాలీలు తీయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

రోడ్డుకు అడ్డంగా...

రోడ్డుకు అడ్డంగా...

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు.

చేతులెత్తి నినాదాలు..

చేతులెత్తి నినాదాలు..

కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీకి పోటీగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం విద్యార్థులు ర్యాలీ తీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్ట్స్ కళాశాల సాక్షి...

ఆర్ట్స్ కళాశాల సాక్షి...

విద్యార్థి ఉద్యమాలకు ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల సాక్షిగా నిలుస్తూ వస్తోంది. శుక్రవారం కూడా ఆందోళనకు అదే సాక్షిగా నిలిచింది.

నోళ్లకు గుడ్డలు కట్టుకుని...

నోళ్లకు గుడ్డలు కట్టుకుని...

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియాలో విద్యార్థులు నోళ్లకు గుడ్డలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు.

కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీ

కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీ

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరుస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కాంట్రాక్టు ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు.

English summary
Tension prevailed in Osmania university as Stuents and contract staff clashed with rallies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X