కెసిఆర్ తాత దిగొచ్చినా..: నారా లోకేష్ ఫైర్ (పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి బాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాడని, కేసీఆర్‌ తాత దిగొచ్చినా తెలంగాణలో తమ పార్టీని దెబ్బతీయలేరని తెలుగుదేశం పార్టీ (టిడిపి) కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ అన్నారు.

సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విద్యార్థుల మేధోమథన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టిడిపి ఉపాధ్యక్షుడు ఇ. పెద్దిరెడ్డి మాట్లాడుతూ - పేదల సంక్షేమమే పునాదిగా ఏర్పడ్డ తమ పార్టీ కేసీఆర్‌ లాంటి అనేకమంది అరాచకవాదులను ఎదుర్కొని నిలబడ్డదన్నారు. విద్యావ్యవస్థను ధ్వంసం చేసిన కెసిఆర్ ప్రభుత్వం గుండాయిజాన్ని పెంచి పోషిస్తోందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్‌ ఆరోపించారు.

టిడిపి ఆఫీసుల తగలబెడితే కరెంట్‌ ఉ త్పత్తి కాదని, చిత్తశుద్దితో కేంద్ర ప్రభుత్వం, పక్క రాష్టాలను సమన్వయం చేసుకుంటేనే కరెంట్‌ కష్టాలనుంచి ప్రభు త్వం బయటపడుతుందని నారా లోకేష్. బంగారు తెలంగాణ నిర్మి స్తానని ప్రగల్బాలు పలికిన కెసిఆర్‌ కేంద్రప్రభుత్వ పెద్దలను కలవడానికి ఐదు నెలలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లారని, అందులో ఒక సారి ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లారని, సమస్యలు పరిష్కరించుకోలేకపోయారని ఆయన అన్నారు.

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

తమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కరెంట్‌కోసం నాలుగునెలల్లో ఆరు సార్లు ఢిల్లీ వెళ్లి ఒక్క రోజునే 12మంది మంత్రులను కలిసి సమస్యను పరిష్కరించుకున్నారని అన్నారు. కెసిఆర్ ఆ పని చేయలేకపోయారని అన్నారు.

ఫామ్‌హౌస్‌కే కెసిఆర్ పరిమితం

ఫామ్‌హౌస్‌కే కెసిఆర్ పరిమితం

రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కెసిఆర్‌ కనీసం బాధిత కుటుంబాలను పరామర్మించక పోవడం ఆవేదన కలిగిస్తోందని నారా లోకేష్ అన్నారు.

పొట్టన పెట్టుకుంది..

పొట్టన పెట్టుకుంది..

ఫించన్లు దరఖాస్తు కోసం వచ్చిన కురువృద్దులను కెసిఆర్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని నారా లోకేష్ దుయ్యబట్టారు. అబద్దాలు, ఆరోపణలతో కెసిఆర్‌ అసమర్థతను ఎక్కువకాలం దాచుకోలేరన్నారు.

కెసిఆర్ కుటుంబానికే దక్కింది

కెసిఆర్ కుటుంబానికే దక్కింది

అధ్బుతమైన తెలంగాణ రాష్టాన్ని అవస్ధల పాలు చేసిన ఘనత కెసిఆర్‌ కు టుంబానికే దక్కిందని నారా లోకేష్ విమర్సించారు విమర్శించారు.

కెసిఆర్‌కూ గుణపాఠం

కెసిఆర్‌కూ గుణపాఠం

విద్వే షాలు రెచ్చగొట్టిన ఎంఎన్‌ఎస్‌ పార్టీకి మహారాష్ట ఎన్నికల్లో ప్రజలిచ్చిన గుణపాఠం 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ కూడా తప్పదని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డి అన్నారు. రెండు రాష్టాల అభివృద్ది ముందు చూపు ఉ న్న యువతతోనే సాధ్యమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+