బాబుతో నిర్మలా సీతారామన్, రాజ్యసభకు (పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. లేక్ వ్యూ అతిథి గృహంలో ఆమె చంద్రబాబుతో సమావేశమయ్యారు.
మర్యాదపూర్వకంగానే తాను చంద్రబాబును కలిసినట్లు భేటీ అనంతరం నిర్మలా సీతారామన్ భేటీ తర్వాత మీడియాతో చెప్పారు. రాష్ట్రంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ బిజెపికి కేటాయించింది.
ఆ స్థానాన్ని బిజెపి నాయకత్వం నిర్మాలా సీతారామన్‌కు కేటాయించింది. శనివారం మధ్యాహ్నం ఆమె రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమె రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కావడం లాంఛనమేనని అంటున్నారు.

బాబుతో నిర్మలా సీతారామన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశయమ్యారు.

బాబుతో నిర్మలా సీతారామన్ భేటీ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశో కోడలు. ఆమె రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కానున్నారు.

బాబుతో నిర్మలా సీతారామన్ భేటీ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు బిజెపి నాయకత్వం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటును కేటాయించింది.

బాబుతో నిర్మలా సీతారామన్ భేటీ
బిజెపితో పొత్తు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ సీటును తెలుగుదేశం ఆ పార్టీకి కేటాయించింది. దీంతో నిర్మలా సీతారామన్ చంద్రబాబుతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications