చీరెల సింగారంతో హీరోయిన్ సమంత సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ వస్త్ర దుకాణం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హైదరాబాదులోని అమీర్‌పేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాఖను సినీనటి సమంత శుక్రవారం ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేసిన సంప్రదాయాల దుస్తులను పరిశీలించారు.
గంట పాటు షాపింగ్ మాల్‌లో సమంత సందడి చేశారు. సమంతను చూసేందుకు అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్ నుండి విద్యార్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి.
ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎస్ సురేష్, పీ సాయి అభినవ్, టీ రాకేష్, పీ కేశవ్‌గుప్తాలు సమంతను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కాస్ట్ టూ కాస్ట్ సేల్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

షాపింగ్ మాల్ ప్రారంభం
హీరోయిన్ సమంత రిబ్బన్ కత్తిరించి సౌత్ ఇండియా సాపింగ్ మాల్ శాఖను హైదరాబాదులోని అమీర్‌పేటలో శుక్రవారంనాడు ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలనం చేశారు..
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అమీర్ పేట్ శాఖను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన సమంత ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలనం చేశారు.

దుస్తులను చూసి...
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త శాఖలో హీరోయిన్ సమంత దుస్తులను పరిశీలిస్తూ ఇలా గడిపారు.

అబిమానుల సందడి
హైదరాబాదులోని అమీర్‌పేట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు తమ అబిమన నటి సమంత వస్తుందని తెలుసుకున్న విద్యార్తులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.

ఇలా సమంత
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో అందాల భామ సమంత దాదాపు గంటకుపైగా ఉన్నారు. ఆమెను చూసేందుకు పెద్ద యెత్తున అభిమానులు అక్కడికి వచ్చారు.

చీరలో సింగారం...
హీరోయిన్ సమంత అందమైన చీరలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా అందాలను ఒలబోశారు. ఇలా ముద్గుగా కనిపించారు.

చీరెను ప్రదర్శిస్తూ...
తెలుగు సినీ హీరోయిన్ సమంత సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో చీరెలను ఇలా ప్రదర్శిస్తూ కనిపించారు. ఆమె గంటకు పైగా షాప్‌లో సందడి చేశారు.

రంగు రంగుల చీరెలు..
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర దుకాణంలో తెలుగు హీరోయిన్ సమంత చీరలో సింగారం ఎలా ఉంటుందో చూపిస్తూ ఇలా..












Click it and Unblock the Notifications