సిటీలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపనపై రగడ (పిక్చర్స్)

హదైరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనపై హైదరాబాదులోని మియాపూర్‌లో బుధవారం రగడ చోటు చేసుకుంది. విగ్రహ ప్రతిష్టాపనపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అనుమతి లేని విగ్రహాన్ని తొలగించాలని తెలంగాణ వాదులు, తెరాస నేతలు డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జయంతి సభ ముగిసిన తర్వాత మేమే తొలగిస్తామని టిడిపి నేతలు వివాదానికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇరువర్గాల కార్యకర్తలను సముదయించడానికి పోలీసులు పరుగులు తీస్తూ ఇరుపార్టీల నేతలను పరుగులు తీయించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన గంటకే భారీ పోలీసుల మోహరింపు మధ్య అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు భారీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి తీసుకువెళ్లారు.

అనంతరం టిడిపి నేతలు తమ విగ్రహాన్ని తమకే అప్పగించాలని ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి పరిస్థితి గందరగోళానికి దారితీయడంతో మిలటరీ దళాలు, మాదాపూర్ జోన్ డీసీపీ రాణా ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు, భారీగా పోలీసు సిబ్బంది చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాయి. అయినప్పటికీ టిడిపి నేతలు భీష్మించుకొని కూర్చోవడంతో ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్‌లను, సీనియర్ నాయకులను అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఎన్టీఆర్ విగ్రహ స్థాపన రగడ

ఎన్టీఆర్ విగ్రహ స్థాపన రగడ

హైదరాబాదులోని మియాపూర్‌లో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనపై బుధవారం తెరాస, టిడిపి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది.

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన విగ్రహాన్ని పెట్టారు. దాన్ని తెలంగాణవాదులు, తెరాస కార్యకర్తలు వ్యతిరేకించారు.

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి లేదని తెరాస కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులు కూడా అదే విషం చెప్పారు.

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనపై బుధవారం తెరాస, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కల్పించుకున్నారు.

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి లేదని అధికారులు తొలగించారు. తర్వాత తీసేస్తామని టిడిపి నాయకులు చెప్పినా వినలేదు.

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహాన్ని జిహెచ్ఎంసి అధికారులు తొలగించి తీసుకుని వెళ్లారు. విగ్రహాన్ని తమకు అప్పగించాలని టిడిపి కార్యకర్తలు ఆందోళకు దిగారు.

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

మియాపూర్‌లో బుధవారం టిడిపి కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పడంతో తెరాస, టిడిపి కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీఆర్ విగ్రహంపై రగడ

ఎన్టీ రామారావు విగ్రహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెరాస కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+