జగన్ ఓదార్పు: పాచి పులిహోర అంటూ (పిక్చర్స్)
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. తాజాగా ఆయన శుక్రవారంనాడు విశాఖ ఉత్తర,త పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని కంచంమెట్టులోని గాంధీనగర్, సాకేతపురం కాలనీ, స్టీల్ ప్లాంట్, ఇస్లాంపేట, బర్మా కాలనీ, దయాల్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.
కాలినడకన కలియదిరిగి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ వద్ద బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం వద్ద లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదని వైయస్ జగన్ విమర్శించారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తాత్కాలికంగా పార్టీ తరఫున సాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మంచినీటికి అల్లాడుతున్న మురికివాడులకు రాజకీయ కక్ష సాధింపుతో ప్రభుత్వం సహాయం నిరాకరిస్తోందని ఆయన విమర్శించారు.

జగన్ ఓదార్పు
బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వేయి కుటుంబాలు ఉన్న కాలనీకి రాత్రిపూట లారీల్లో వచ్చి 200 పులిహోర ప్యాకెట్లు విసిరేసి పోతున్నారని జగన్ అన్నారు.

జగన్ ఓదార్పు
బాధితులకు విసిరేసి పోతున్న పులిహోరా కూడా కూడా పాచిపోయి తినేదందుకు పనికి రావడం లేదని జగన్ విమర్శించారు.

జగన్ ఓదార్పు
లక్షలాది మంది రోడ్డున పడ్డారని, తిండి లేదని, ఇల్లు లేనది, చేతిలో చిల్లిగవ్వ లేదని జగన్ అన్నారు. పనికీ దీక్కు లేదని జగన్ అన్నారు.

జగన్ ఓదార్పు
ప్రజలు అల్లాడుతున్నా ఇంత వరకు ఒక్కరు కూడా పలకరించలేదని, దమ్మీ సాయం కూడా చేయలేదని, ప్రతి ఇంటిలోనూ బాధితులు ఇదే మాట చెబుతున్నారు.

జగన్ ఓదార్పు
తుఫాను తాకిడి ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన శనివారంనాడు కూడా కొనసాగింది. శనివారంనాడు ఆయన అనకాపల్లి నర్సింగరావు పేటలో పర్యటించారు.

జగన్ ఓదార్పు
తుఫానుకు ధ్వంసమైన ఇళ్లను జగన్ పరిశీలించారు. తుఫాను వచ్చి ఏడు రోజులైనా ఏ అధికారి కూడా తమ వద్దకు రాలేదని బాధితులు జగన్‌తో చెప్పారు.












Click it and Unblock the Notifications