చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును గురువు బాగా కొట్టేవారట (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుర్తుకొస్తున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం నారావారిపల్లెలో తన మిత్రులతో సోమవారంనాడు గడిపారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆయన నారావారిపల్లెలో తన చిన్ననాటి గురువును కూడా ఆయన కలుసుకున్నారు. తన గురువు ముందు చంద్రబాబు రెండు చేతులూ జోడించి నిలుచున్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈనాటి రాజకీయ నాయకుడు చంద్రబాబును చూసి గురువు తబ్బిబ్బయ్యారు.

'అయ్యా.. ఆ రోజుల్లో మిమ్మల్ని బాగా కొట్టేవాడిని..' అంటూ మెల్లగా గతం గుర్తుచేశారు చంద్రబాబునాయిడి గురువు. రిటైర్మెంట్ తీసుకుని సోమవారం చంద్రబాబు ముందు నోరు విప్పిన ఆ ఉపాధ్యాయుడి పేరు పి.లక్ష్మణరెడ్డి. దాంతో చంద్రబాబుకు కూడా ఆ గురువు కొట్టిన దెబ్బలు గుర్తుకు వచ్చినట్లే ఉన్నాయి. ముఖంలో చిరునవ్వు వికసించింది. 'అవును సార్. మీరు చాలా ఎక్కువగా కొట్టేవారు. ఆ రోజు మీరు అలా కొట్టి ఉండకపోతే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. మీ దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణే నన్ను ఇంతవాణ్ణి చేసింది' అంటూ చంద్రబాబు చెప్పారు.

'సార్..! మీరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి' అంటూ మరో మిత్రుడు చెప్పగా.. 'సార్ ఏమిటి సార్, చంద్రబాబు మన క్లాస్‌మేట్. పేరు పెట్టి పిలువు' అంటూ మరొకరు గదమాయించారు. దీనిపై చంద్రబాబు కలుగజేసుకొని.. 'మీ ఇష్టం. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా పిలవండి. పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్నందరినీ ఒకచోట చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది' అన్నారు.

నారావారిపల్లెలో చంద్రబాబు ఇలా..

నారావారిపల్లెలో చంద్రబాబు ఇలా..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావాలిపల్లెలో తన బాల్యస్నేహితులతో, తన ఉపాధ్యాయులతో సంక్రాంతి వేళ ఉల్లాసంగా గడిపారు.

మద్దతు కోరిన చంద్రబాబు

మద్దతు కోరిన చంద్రబాబు

తనకు ఆశీస్సులు కావాలంటూ చంద్రబాబు తన బాల్యస్నేహితులను, ఉపాధ్యాయులను కోరారు. జరగబోయే ఎన్నికలు దేశం, రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవని, తాను ధర్మం తరపున పోరాడుతున్నానని చెప్పారు.

గురువులకు చంద్రబాబు సత్కారం

గురువులకు చంద్రబాబు సత్కారం

తాను ముఖ్యమంత్రి అయిన తరువాత మళ్లీ హైదరాబాద్‌లో ఇలాగే మరోసారి కలుద్దామంటూ చెప్పారు. ఆత్మీయ సమావేశం తర్వాత ముగ్గురు గురువులను చంద్రబాబు సన్మానించారు. స్నేహితులను దుశ్శాలువాలతో సన్మానించారు.

బాల్య స్నేహితులతో చంద్రబాబు

బాల్య స్నేహితులతో చంద్రబాబు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా సోమవారం ఆయన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో తన నివాసంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి చంద్రబాబుతో కలిసి చదువుకున్న 53 మంది వచ్చారు. వీరందరినీ చంద్రబాబు పేరుపేరునా పలకరించారు.

యోగక్షేమాలు అడుగుతూ..

యోగక్షేమాలు అడుగుతూ..

చంద్రబాబు తన బాల్య మిత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారేం చేస్తున్నారో, వారి పిల్లలు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకు 8, 9 తరగతుల్లో పాఠాలు చెప్పిన ముగ్గురు ఉపాధ్యాయులూ ఆ సమావేశంలో పాల్గొన్నారు.

గురువుకు దండాలు...

గురువుకు దండాలు...

చంద్రబాబు తన గురువు పి. లక్ష్మణ రెడ్డికి చేతులు జోడించి దండాలు పెట్టారు. మీరు బాగా కొట్టేవారని చంద్రబాబు గుర్తు చేశారు.

పండుగే పండుగ..

పండుగే పండుగ..

తన బాల్య మిత్రులతో చంద్రబాబు ఇట్లే కలిసిపోయారు. వారిని పేరు పేరునా పలకరించారు. తనను మిత్రులు ఎలాగైనా పలకరించవచ్చునని, సార్ అనాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

పార్టీ జెండా ఎగురేశారు..

పార్టీ జెండా ఎగురేశారు..

సంక్రాంతి పర్వదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

పరీక్షల్లో చూపించేవారట..

పరీక్షల్లో చూపించేవారట..

ఎంపీ శివప్రసాద్ తనకు సన్నిహితులైన ఇద్దరు మిత్రులను చంద్రబాబుకు చూపిస్తూ.. 'సార్.. వీళ్లు నేను కలిసి పిరియడ్స్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవాళ్లం. పరీక్షల్లో కూడా నేను వీరిద్దరికి చూపించాల్సిందే' అంటూ పాతస్మృతులను నెమరేసుకున్నారు.

ఎక్కువగా కొట్టేవారట..

ఎక్కువగా కొట్టేవారట..

లక్ష్మణ్ రెడ్డి తాను విద్యార్థులను కొట్టడం గురించి చంద్రబాబుతో ప్రస్తావించారు. నారాయణరెడ్డి సార్ కన్నా మీరు ఎక్కువ కొట్టేవారని, మీరలా నేర్పించిన క్రమశిక్షణే నన్ను ఇంతటి వాడిని చేసిందంటూ చంద్రబాబు తన గురువుకు చేతులెత్తి నమస్కరించారు.

మిత్రులకూ దండాలు..

మిత్రులకూ దండాలు..

చంద్రబాబు నాయుడు తన బాల్య మిత్రులతో తన చిన్ననాటి జ్ఝాపకాలను నెమరేసుకున్నారు. బడి ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.

English summary
Telugudesam president and former chief minister Nara Chandrababu naidu met his childhood friends and teacher at his village Naravaripalle in Chittoor disrtict during Sankranthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X