ఘోరం: మహిళపై దాడి చేసి, ఈడ్చుకెళ్లిన పందులు, తీవ్రగాయాలు (వీడియో)
నెల్లూరు: జిల్లాలోని కావలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లున్న వృద్ధురాలైన ఓ మహిళపై దాడి చేసిన పందులు.. ఆమెను కిందపడేసి కొరికేశాయి. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పందులను రాళ్లతో కొట్టి తరిమేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కావలిలోని వైకుంఠపురం ప్రాంతానికి చెందిన షేక్ బీబీజాన్ అనే మహిళ పలు ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. శుక్రవారం అయ్యప్పస్వామి గుడి పక్కవీధిలో నడిచి వెళ్తుండగా ఓ పందుల గుంపు ఆమెపై దాడి చేసింది.

కిందపడ్డ ఆమెను రెండు పందులు ఈడ్చుకుంటూ వెళ్లాయి. గమనించిన స్థానికులు కేకలు వేసిన ప్రయోజనం లేకపోవడంతో రాళ్లతో కొట్టి పందులను తరిమేశారు. వెంటనే 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పందుల దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, పందులు ఈ విధంగా దాడి చేయడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. పందులు స్థానికంగా ఎక్కువగా ఉన్నాయని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications