ఆ పని వదిలేసి పవన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ...వదిలిపెట్టని యాంకర్ శ్యామల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వైసిపి అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గత కొద్ది రోజులుగా విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోజా పైన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని మండిపడిన యాంకర్ శ్యామల ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటూ, ఆయన స్పందన తెలియ చేయాలంటూ డిమాండ్ చేశారు.
హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేసిన యాంకర్ శ్యామల
ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుకు అనుమతించడంతో వైసిపి అధికార ప్రతినిధి శ్యామల కూటమి ప్రభుత్వం పైన సెటైర్లు వేశారు. సినీ నిర్మాతలు చెబితే టిక్కెట్టు ధరలు పెంచినట్టుగానే, రైతులు అడిగితే తక్షణమే గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వాలు రావాలని యాంకర్ శ్యామల డిమాండ్ చేశారు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సెటైర్
''మా సినిమా నిర్మాణానికి ఇంత ఖర్చు పెట్టాం. టికెట్ ధరలను పెంచండి .. అని సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చెప్పగానే... తక్షణమే ప్రభుత్వాలు అనుమతించినట్టుగా, అయ్యా .. మా పంటలకు ఇంత పెట్టుబడి పెట్టాం .. మాకు గిట్టుబాటు ధర కావాలయ్యా.. అని రైతులు అడిగిన వెంటనే ..వారికి తక్షణమే గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వాలు రావాలి. ఏమంటారు..?'' అని శ్యామల ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అంటూ శ్యామల టార్గెట్
ఇక తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన శ్యామల పిఠాపురం మత్స్యకారులు ఎన్నికల సమయంలో తమకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ డిమాండ్ తో వారు పిఠాపురం జనసేన కార్యాలయాన్ని ముట్టడిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తనది పిఠాపురమే కాదు అన్నట్టు తన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారంటూ శ్యామల టార్గెట్ చేశారు.
ప్రజలనుద్దేశించి ఆసక్తికర ట్వీట్
హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా తిరుగుతున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని చెప్పే ప్రయత్నం చేశారు. థింక్ ట్వైస్ ఓట్ వైజ్ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తెలివిగా ఓటెయ్యండి అని అందుకే అంటారు అంటూ వైసిపి అధికార ప్రతినిధి శ్యామల ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications