స్ధానిక ఎన్నికలపై ఒకేసారి సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు- వైసీపీ వ్యూహమిదే...
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న వాయిదా నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఈ నిర్ణయంపై గవర్నర్ హరిచందన్ వద్ద తన అసంతృప్తిని వెళ్లగక్కిన సీఎం జగన్.. ఆ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఏకంగా ఎన్నికల కమిషనర్ కుల ప్రస్తావన తెస్తూ నిప్పులు చెరిగారు. అయితే ఎన్నికల వాయిదాను ఈసీ వెనక్కి తీసుకునేలా న్యాయపోరాటానికి ప్రభుత్వం సిద్దమైంది. ఒకేసారి సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లలు దాఖలు చేసింది. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది.

కోర్టుల్లో ఎన్నికల వాయిదాపై న్యాయపోరాటం
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదాపై న్యాయపోరాటానికి సిద్ధమైన వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముందుగా ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ సర్కారు, మధ్యాహ్నంలోగా హైకోర్టులోనూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీంతో ఒకేసారి రెండు పిటిషన్ల దాఖలు వెనుక పరమార్ధం ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నా ముందుగా సుప్రీం తలుపు ఎందుకు తట్టారన్న దానిపై చర్చ సాగుతోంది.

సుప్రీంకోర్టులో అయితేనే సేఫ్..
స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని తొలుత హైకోర్టులో దాఖలు చేసే అవకాశమున్నా ప్రభుత్వం సుప్రీంకోర్టు వైపు మొగ్గు చూపింది. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. తీర్పు ఆలస్యమైనా, ప్రతికూల తీర్పు వచ్చినా తిరిగి సుప్రీం గడప తొక్కాల్సిందే. దీంతో ముందుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు.

హైకోర్టులోనూ లంచ్ మోషన్..
ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ ఓవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం .. మరోవైపు హైకోర్టు లోనూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అంటే అత్యవసర విచారణ అన్న మాట. సుప్రీంకోర్టులో వేసిన కేసులో విచారణ రేపు జరగనుందని తేలిపోవడంతో హైకోర్టులోనూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అయితే దీని వెనుక మరో వ్యూహం ఉంది. ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు రిఫర్ చేస్తే కాలయాపనతో పాటు మరిన్ని చిక్కులు తప్పవు. అందుకే ఒకే సమయంలో సుప్రీంకోర్టులోనూ, హైకోర్టులోనూ పిటిషన్లు వేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందన్న కారణంతో తమ విచారణను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో రేపు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టులోనూ పిటిషన్ పెండింగ్ ఉందని చెప్పుకునే అవకాశం లభించింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణే దీనికి కారణమని కూడా చెప్పుకునే అవకాశం దొరికింది.

వరుస పిటిషన్లతో ఈసీపై ఒత్తిడి...
మరోవైపు రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు, హైకోర్టులను ఒకేసారి ఆశ్రయించడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది. రెండు చోట్ల పిటిషన్లతో ఒకదాని వెంట మరొకటి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. లేదా రెండింటిలో ఏదో ఒక కోర్టు తీర్పు వెంటనే వెలువరించే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్న కమిషనర్ పై ఒత్తిడి తప్పదు. ఇంత తక్కువ సమయంలో న్యాయపోరాటానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమయ్యే అవకాశాలూ తక్కువే. అదే సమయంలో ఈ నెల 31లోపు ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు నిలిచిపోతాయన్న వాదనతో ఒకేసారి అందరిపైనా ఒత్తిడి పెంచొచ్చన్న ఆలోచన కూడా ప్రభుత్వం పిటిషన్ల వెనుక కారణంగా అర్ధమవుతోంది.
-
ఆ రెండు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..!












Click it and Unblock the Notifications