మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!!
ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదం మిగుల్చింది. ఈ ప్రమాదంలో ఈ దుర్ఘటనలో 13 మంది చనిపోయారని, 22 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ప్రమాదం పైన ప్రధాని మోదీ స్పందించారు. బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు.. సీఎం చంద్రబాబు ఈ ప్రమాదం పై సమీక్ష చేసారు. గాయపడిన వారికి చికిత్స తో పాటుగా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నానని చెప్పారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా.. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మంత్రులు అనిత, జనార్థన్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని సీఎంకు తెలిపారు.ఈ దుర్ఘటనలో 13 మంది చనిపోయారని, 22 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.

ముఖ్యమంత్రి సమీక్ష.. సహాయక చర్యలు
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు జగిత్యాల నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై డ్రైవర్‌ను విచారించగా.. తన వాహనం స్టీరింగ్ స్టక్ అయ్యిందని చెప్పాడని.. దీనిపై నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నారని సీఎంకు తెలియజేశారు. బస్సు పూర్తిగా ఆపోజిట్ రూట్‌లో వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు. గాయ పడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని గుంటూరు ఆసుపత్రికి తరలించే ఆలోచనలో ఉన్నామని సీఎంకు జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ దుర్ఘటనలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంద రు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications