ఏపీకి ప్రధాని మోదీ వరాలు- కీలక మలుపు..!!
ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సర్వం సిద్దమైంది. మూడో సారి ప్రధానిగా బాధ్యతల స్వీకరణ తరువాత తొలి సారి ఏపీకి వస్తున్నారు. దాదాపు రూ రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపన చేస్తారు. విశాఖ నగరంలో చంద్రబాబు, పవన్ తో కలిసి దాదాపు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో లో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రధాని పర్యటన పైన ఆసక్తి నెలకొంది. డబుల్ ఇంజన్ సర్కార్ లో విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ టూర్ ఏపీ భవిష్యత్ కు కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.
మోదీ టూర్ పై ఆసక్తి
ప్రధాని మోదీ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు స్వయంగా ప్రధాని తన విశాఖ పర్యటన పైన ట్వీట్ చేసారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రధానికి స్వాగతం పలికేందు కు నిరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. ఏయూ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

టూర్ షెడ్యూల్
సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు మేర రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.45 వరకూ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు. సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని 7.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరి వెళతారు.
శంకుస్థాపనలు
ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదా రులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండ లం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూ నుంచి బీబీ నగర్ వరకు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.












Click it and Unblock the Notifications