మోదీ కేబినెట్ విస్తరణ, ఏపీకి మరో బెర్తు - ఆయనకే ఫిక్స్..!!

ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్దమయ్యారు. ప్రభుత్వం - పార్టీ లో కొత్త నిర్ణయాల దిశ గా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులు-ఆరెస్సెస్ ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. వచ్చే పార్లమెంట్ పోల్స్ కోసం ఇప్పటి నుంచే సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఏపీ - తెలంగాణలో ప్రధాని వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా సాయిరెడ్డి స్థానంలో బీజేపీ రాజ్యసభ అభ్యర్ధితో పాటుగా.. మంత్రి వర్గ విస్తరణలో ఏపీకి మరో బెర్తు విషయంలోనూ కీలక మంత్రాంగం సాగుతోంది.

కేంద్ర కేబినెట్ విస్తరణ
ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహ రచన చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమ యంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవటం కీలకంగా భావిస్తున్న బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఏపీ నుంచి సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంలో తమిళనాడు నేత అన్నామలైకు అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయించినట్లు పార్టీ నేత ల సమాచారం. అదే సమయంలో పవన్ తోనూ బీజేపీ నాయకత్వం కీలక మంత్రాంగం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

pm-modi-likely-to-reshuffle-his-cabinet-in-next-month-one-more-for-ap

మోదీ మార్క్ వ్యూహాలు
పవన్ కేంద్ర కేబినెట్ లో వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బీజేపీ నాయకత్వం జమిలి ఎన్నికలకు కసరత్త చేస్తూనే.. ఇప్పటి వరకు దక్కని రాష్ట్రాల్లో పాగా వేయటం పైన ఫోకస్ చేసింది. మోదీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనుంది. ఈ సారి కేబినెట్ లోకి ఆరెస్సెస్ నేపథ్యం.. పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది . పార్టీపై పూర్తిగా పట్టుబిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయను న్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడుగా నియమించనుంది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నేతలకు, బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. ఏపీ నుంచి ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులు గా కొనసాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. దీంతో, ఈ సారి ఏపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఖాయమని సమాచారం.

Take a Poll

పవన్ - అన్నామలై
మారుతున్న సమీకరణాల్లో భాగంగా పవన్ ఆమోదం చెబితే మోదీ కేబినెట్ లో కీలక పోర్టు ఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. పవన్ ఏపీలోనే కొన సాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో పవన్ కు అవకాశం ఇవ్వనున్నారు. తమిళనాడులో గెలుపు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కొంత కాలంగా పవన్ సైతం తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. పవన్ రాష్ట్రంలోనే కొనసాగితే... ఏపీ కోటాలో రాజ్యసభకు ఖాయ మని చెబుతున్న అన్నామలై కేంద్ర మంత్రి కావటం దాదాపు ఖాయం. అన్నామలై తమిళనాడు తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ అజెండా విస్తరణ కోసం పని చేయనున్నారు. దీంతో.. ఇప్పుడు పవన్ - అన్నామలై ఇద్దరితో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తమ మార్క్ రాజకీయానికి సిద్దం అయింది. ఇక, మంత్రివర్గ విస్తరణలో ఏపీకి తుది జాబితాలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+