ఏపీ ఎన్నికలపై ప్రధాని మోడీ జోస్యం..టీడీపీ - జనసేనతో స్నేహం అందుకే - తాజా ఇంటర్వ్యూలో..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు 48 గంటలే మిగిలున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో ఈసారి జరగబోతుున్న ఎన్నికలపై ఓ ప్రాంతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టీడీపీ-జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, వైసీపీ ప్రభుత్వంతో, సీఎం జగన్ తో తమకున్న బంధం ఏంటి, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందన్న అంశాలపై మోడీ తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఏపీలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయని, అది రాష్ట్రంలో వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ప్రశ్నకు జవాబుగా.. ఓ కొత్త రాష్ట్రం అభివృద్ధికి హామీలు ఇవ్వాల్సి ఉంటుందని మోడీ తెలిపారు. కానీ కొత్తగా ఏర్పాటైన తెలంగాణ, ఏపీ కుమ్ములాడుకుంటున్నాయన్నారు. వాళ్లు రూపొందించుకున్న విధానాలు అవినీతికి దారి తీశాయన్నారు. ఏపీలో ఇసుక, మద్యం మాఫియా, తెలంగాణలో భూమాఫియా నడుస్తోందన్నారు. ప్రజల కోసం తగిన విధానాలు వారి వద్ద లేనప్పుడు ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయన్నారు.

pm modi predicts nda government this time in ap reveals reason for bjp s tie-up with tdp-janasena

ఏపీలో వైసీపీ తిరిగి గెలుస్తుందని అనుకోవడం లేదని మరో ప్రశ్నకు జవాబుగా ప్రదాని మోడీ తెలిపారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్ధితి బాగోలేదని, ఆ ప్రభావం కిందిస్దాయి వరకూ వెళ్లిందన్నారు. జగన్ ఎప్పుడూ తమ రాజకీయ మిత్రపక్షం కాదని, కేవలం పార్లమెంట్ లో సందర్భాన్ని బట్టి మద్దతిచ్చారన్నారు. గతంలోనూ జగన్ కు వ్యతిరేకంగా తాము ఎన్నిక్లలో పోరాడామన్నారు. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్, ప్రధానిగా తానూ రాజ్యాంగం ప్రకారం పార్టీలను చూడకుండా పనిచేశామన్నారు.

దేశంలో ప్రతీ రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, ఏపీకీ అదే విధంగా సాయం చేశామన్నారు. ఎన్నికల వరకూ వస్తే టీడీపీ, బీజేపీ ఎప్పటి నుంచో కలిసి పోటీ చేస్తున్నాయని, ఇప్పుడు జనసేన కూడా తోడయిందని, కాబట్టి ఈసారి జనం మద్దతు ఎన్డీయే సర్కారుకే ఉంటుందని పక్కాగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంపీ సీట్లు కూడా ఎక్కువగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

జనసేన-టీడీపీతో కలిసి వెళ్లాలని అనుకోవడం వెనుక కారణమేంటన్న ప్రశ్నకు అందరినీ కలుపుకుని వెళ్లాలనేది బీజేపీ సిద్ధాంతమని, వీలైనన్ని పొత్తులు తమ మూల సిద్దాంతమని మోడీ తెలిపారు. తమకు బీజేపీ పెద్ద పార్టీ అని, ఎవరి సాయం అక్కర్లేదన్న అహంకారం లేదన్నారు. దేశంలో ఎన్డీయే, ఇండీ కూటమి రూపంలో రెండే పక్షాలు ఉన్నాయని, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల్ని గౌరవించాల్సిందేనన్నారు. అలాగే జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షల్ని గౌరవించాలన్నారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వాటిని నెరవేర్చడం సులువవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+