Yogandhra 2025: విశాఖ చేరుకున్న మోడీ-బాబు, పవన్ ఘనస్వాగతం..!
రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆసనాలు వేసేందుకు జనం సిద్దమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్, అధికారులు ఘన స్వాగతం పలికారు.
విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని గతంలో అమరావతి పనుల పునఃప్రారంభ సభకు హాజరైన సందర్భంగా ప్రధాని మోడీ సీఎం చంద్రబాబును కోరారు. దీంతో నెల రోజులుగా యోగాంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం 2 కోట్ల మందిని సంసిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దాన్ని మించి 2.39 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

రేపు విశాఖలోని ఆర్కే బీచ్ లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు, సాధారణ ప్రజలు యోగాసనాలు వేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా యోగాసనాలు వేయించి గిన్నిస్ రికార్డు సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున నిధుల్ని కూడా ఖర్చుపెడుతున్నారు. అలాగే విద్యార్ధులు, సాధారణ ప్రజల్లోనూ అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications